ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బిమారు రాష్ట్రాల కంటే ఏపీ వెనుకబాటు - ఐటీ రంగంలో అధమ స్థానంలో రాష్ట్రం - states startup ranking

IT Sector Condition in Andhra Pradesh: ఒకప్పుడు ఐటీ అంటే ఆంధ్రప్రదేశ్! ఐటీ సంస్థల చూపు ఇటువైపే! ఐటీలో ఓ కొత్త పరిణామాన్నైనా ఆంధ్రావని అందిపుచ్చుకునేది! ప్రస్తుతం పరిస్థితి తారుమారైంది. ఒడిశా మనల్ని దాటి దూసుకెళ్తోంది. బిహార్‌ పరుగెడుతోంది. రాజస్థాన్‌ మనకంటే ముందుంది. జగనన్న పాలనలో మన రాష్ట్రం త్రిపుర, మణిపుర్‌, ఛత్తీస్‌గఢ్‌లతో పోటీపడుతోంది. ఇది అక్కసుతో విపక్షాలు చేస్తున్న విమర్శ కాదు! కేంద్రం విడుదల చేసిన నిఖార్సైన నిజం.

it Sector_Condition_in_Andhra_Pradesh
it Sector_Condition_in_Andhra_Pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 27, 2024, 9:39 AM IST

బిమారు రాష్ట్రాల కంటే ఏపీ వెనుకబాటు - ఐటీ రంగంలో అధమ స్థానంలో రాష్ట్రం

IT Sector Condition in Andhra Pradesh: విద్యార్థి దశలోనే యువత వ్యాపార ఆలోచనలూ చేస్తున్నారు. ఆ మార్పుని గమనించి స్టార్టప్ ఎకో సిస్టం అభివృద్ధికి ప్రభుత్వాలు చొరవ చూపుతున్నాయి. కానీ మన ఆంధ్రావనిని మాత్రం దేశంలోనే అత్యంత వెనుకబడిన బిమారు రాష్ట్రాల కంటే కూడా ఐటీ రంగంలో అధ్వాన్న స్థాయికి తీసుకెళ్లింది జగన్ ప్రభుత్వం.

పరిమిత వనరులను వినయోగించుకుంటూ బిహార్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాలు అంకురాల ఏర్పాటులో పురోగతి సాధిస్తుంటే, ఉన్న వనరులను విధ్వంసం చేసి ఏపీ స్థానాన్ని తిరోగమనంలోకి తేవడం జగన్‌కే సాధ్యమైంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ- పారిశ్రామిక ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య సంస్థ- డీపీఐఐటీ (Department for Promotion of Industry and Internal Trade) తాజా గణాంకాలే అందుకు నిదర్శనం. చాలా అభివృద్ధి సూచీల్లో మన కంటే వెనక ఉండే ఒడిశా కూడా ఆ ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థితిలో ఉంది.

విధ్వంసంతోనే పాలన మొదలు పెట్టింది వైసీపీ. అధికారంలోకి రాగానే చేపట్టిన విద్యుత్‌ పీపీఏల సమీక్ష వివాదాస్పదమైంది. గత ప్రభుత్వ భూకేటాయింపుల్ని సమీక్ష చేస్తామంటూ పారిశ్రామికవేత్తలను జగన్ ప్రభుత్వం వేధించింది. అదే తీరుతో రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధి అనుకూల వాతావరణాన్ని దెబ్బతీసింది.

ఐటీని చావుదెబ్బ కొట్టిన జగన్ సర్కార్- పెట్టుబడుల ఆకర్షణలో అట్టడుగున రాష్ట్రం

గత ప్రభుత్వం అంకురాలను ప్రోత్సహించేందుకు విశాఖలో ఏర్పాటు చేసిన స్టార్టప్ విలేజ్‌ను వైకాపా అధికారంలోకి రాగానే కక్షసాధింపుగా మూసేయించింది. స్టార్టప్ విలేజ్‌ భవనాలు, మిలీనియమ్‌ టవర్స్‌ 1, 2 భవనాలనూ ఖాళీగా ఉంచింది. ఇవ్నీ గమనించే ప్రముఖ ఐటీ కంపెనీలు రాష్ట్రానికి రాలేదు. ప్రోత్సాహకాలు అందుతుండటంతో యువ పారిశ్రామికవేత్తలూ పొరుగు రాష్ట్రాలకు వలస పోతున్నారు. గత ప్రభుత్వం ఐటీ అభివృద్ధికి వేసిన బాటను యథావిధిగా వినియోగించుకున్నా, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్రాలతో ఏపీ పోటీ పడేది.

అంకుర సంస్థల ప్రోత్సాహకానికి సంబంధించి ఇన్‌స్టిట్యూషనల్‌ సపోర్ట్, ఇన్నొవేషన్, ఆంత్రప్రెన్యూర్‌షిప్, మార్కెట్‌ అనుసంధానం, ఇంక్యుబేషన్, నిధుల సహకారం, కెపాసిటీ బిల్డింగ్, నిర్దేశిత లక్ష్యాలను చేరుకునేలా రోడ్‌మ్యాప్‌ వంటి అంశాల్లో చూపిన ప్రతిభ ఆధారంగా 2022 సంవత్సరానికి సంబంధించి ర్యాంకులను కేంద్రం ఇటీవల ప్రకటించింది.

స్టార్టప్‌ల అభివృద్ధికి 26 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు తీసుకున్న చర్యల ఆధారంగా మార్కులు ఇచ్చింది. 90 నుంచి 100 మార్కులు వచ్చిన రాష్ట్రాలకు బెస్ట్‌ పెర్ఫార్మర్‌, 70 నుంచి 89 శాతం సాధించిన రాష్ట్రాలకు టాప్‌ పెర్ఫార్మర్‌, 50 నుంచి 69 శాతం సాధించిన వారికి లీడర్స్‌, 30 నుంచి 49 శాతం వచ్చిన రాష్ట్రాలకు ఆస్పైరింగ్‌ లీడర్స్‌, 30 శాతం లోపు మార్కులు వచ్చిన వారికి ఎమర్జింగ్‌ స్టార్టప్స్‌ ఎకో సిస్టం కేటగిరిలుగా డీపీఐఐటీ నిర్దేశించింది.

సీఎం పర్యటనతో ఐటీ ఉద్యోగులకు ముచ్చెమటలు - ఐటీ జోన్, పొలిటికల్‌ యాక్టివిటీ మిలీనియం టవర్స్​లోనే?

తాజా ర్యాకింగ్స్‌లోనూ ఏపీ మూడో కేటగిరి-లీడర్స్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మనతో పాటు ఈ కేటగిరిలో అసోం, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, త్రిపుర రాష్ట్రాలు ఉన్నాయి. దీన్ని బట్టి అంకురాలను ప్రోత్సహించడంలో మనం మనం ఎలాంటి విధానాలు అవలంబిస్తున్నామో అర్థం చేసుకోవచ్చు. జగన్‌ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఐటీ రంగంలో నామమాత్రపు పెట్టుబడులనే రాష్ట్రం ఆకర్షించింది.

ఏపీ ఎలక్ట్రానిక్స్‌ అండ్ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీస్ ఏజెన్సీ- ఏపీఈఐటీఏ, సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్‌ ఆఫ్‌ ఇండియా - ఎస్​టీపీఐ, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అసోసియేషన్‌ ఆఫ్‌ ఏపీ- ఐటీఏఏపీ గణాంకాల ప్రకారం గత ఐదేళ్లలో కేవలం 59 ఐటీ సంస్థలే ఏర్పాటయ్యాయి. గతేడాది విశాఖలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సులో 13 లక్షల 12 వేల కోట్ల పెట్టుబడులకై ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ప్రకటించగా, ఐటీ రంగానికి సంబంధించినవి 41 వేల 748 కోట్ల రూపాయలు మాత్రమే.

రాష్ట్రంలో ఏటా రెండున్నర లక్షల మంది విద్యార్థులు ఇంజనీరింగ్‌ పట్టాలతో బయటకు వస్తున్నారు. వారికి స్థానికంగా ఉపాది లభించక పొరుగు రాష్ట్రాలు, దేశాలకు వలస వెళ్లక తప్పడం లేదు. రాష్ట్రంలో అంకురాలను ప్రోత్సహించే వాతావరణమే లేదనడానికి డీపీఐఐటీ ప్రకటించిన గణాంకాలే నిదర్శనం. మొత్తం లక్షా 9 వేల 571 అంకురాలు డీపీఐఐటీలో రిజిస్టర్‌ అయ్యాయి. ఏపీ మినహా దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలన్నీ మొదటి 8 స్థానాల్లో ఉన్నాయి. ఈ జాబితాలో బిహార్‌ కూడా మనకంటే రెండు స్థానాలు ముందు ఉంది. మహారాష్ట్ర 21 వేల 312, కర్ణాటక 12 వేల 796, ఉత్తరప్రదేశ్‌లో 11 వేల 152 అంకుర సంస్థల ఏర్పాటుతో మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. తమిళనాడు 5, తెలంగాణ 7వ స్థానాల్లో నిలిచాయి. 18 వందల 75 అంకురాలతో ఏపీ 15వ స్థానానికి పడిపోయింది.

IT Sector in AP: అంకురాలను చిదిమేసిన వైసీపీ ప్రభుత్వం.. రాష్ట్రంలో జాడలేని ఐటీ రంగం

అంకుర సంస్థలపై జగన్‌ మాటలు, చేతలకు పొంతనే కుదరడం లేదు. యువత ఆలోచనలను ప్రోత్సహిస్తూ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేలా స్టార్టప్ ఎకో సిస్టం అభివృద్ధి చేయాలని 2021-24 ఐటీ పాలసీలో ప్రభుత్వం పేర్కొంది. నైపుణ్యం ఉన్న యువతను గుర్తించి చేయూత అందించేలా ఆంత్రొప్రెన్యూర్‌షిప్‌ క్లబ్‌లు, ఇంక్యుబేషన్‌ సెంటర్లు, సెలెక్ట్‌ టెక్నికల్‌ ఇన్‌స్టిట్యూషన్‌లను అభివృద్ధి చేయాలని వివరించింది. ఐటీ బయోటెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్‌ రంగాల్లో ఆవిష్కరణలను ప్రోత్సహించేలా విశాఖలో డొమైన్‌ ఇన్నోవేషన్‌ హబ్‌-ఐ-స్పేస్‌ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం 2021-24 ఐటీ పాలసీలో పేర్కొంది. వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది.

రాష్ట్రంలో 3 చోట్ల ఐటీ కాన్సెప్ట్‌ సిటీలను అభివృద్ధి చేస్తామనడం, ప్రపంచస్థాయి వసతులతో ప్లగ్‌ అండ్‌ ప్లే, వాక్‌ టు వర్క్‌ విధానంలో అవి ఉంటాయని చెప్పడంతోనే ప్రభుత్వం మూడేళ్లు గడిపింది. ఐటీ రంగంలో ఎమర్జింగ్‌ టెక్నాలజీపై అధ్యయనానికి విశాఖలో యూనివర్శిటీ ఏర్పాటు చేస్తామంది. అదీ మరిచింది. విశాఖలో ఐ-స్పేస్‌ పేరుతో ఐకానిక్‌ టవర్‌ నిర్మాణానికి ప్రభుత్వం గత ఏడాది మార్చిలో అనుమతి ఇచ్చింది.

No Development in IT Sector: కాన్సెప్ట్ నగరాల ఊసే లేదు.. ఐటీ రంగంలో అభివృద్ధి లేదు..

ఇంక్యుబేటర్లు, కో-వర్కింగ్‌ స్పేస్‌లు, ఏంజెల్‌-వెంచర్‌ క్యాపిటలిస్ట్‌లను అందుబాటులో ఉంచడంతో పాటు చేయూత అందించే విధంగా మెంటార్‌లు, టెక్నోప్రెన్యూర్స్‌ ఉండాలన్నారు. వారితో పాటు ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీస్, పేటెంట్‌ రిజిస్ట్రేషన్స్, లీగల్‌ సర్వీసెస్, ఫండ్‌ సోర్సింగ్, ప్యాకేజింగ్‌ వంటి సేవలు కల్పిస్తామని చెప్పింది. 2022లో దావోస్‌లో జరిగిన ప్రపంచ దేశాల ఆర్థిక సదస్సులో.. యూనికార్న్‌ స్థాయి అందుకున్న కొన్ని కంపెనీల ప్రతినిధులతో సీఎం జగన్‌ సమావేశమై.. విశాఖను స్టార్టప్స్‌ హబ్‌గా తీర్చిదిద్దుతామని అందుకు సహకరించాలని కోరారు. ఆ కథ అక్కడితోనే ముగిసింది.

జగన్‌ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో 653 అంకుర సంస్థలు నమోదయ్యాయన్నది ఐటీ శాఖ అధికారిక ప్రకటన. విశాఖలోని ఏయూలో లక్ష చదరపు అడుగుల్లో ఎసీటీపీఐ సహకారంతో టెక్నాలజీ పార్కు, విశాఖ ఉక్కు కర్మాగారంలో ఇండస్ట్రీ-4 ఆవిష్కరణలను ప్రోత్సహించేలా 'కల్పతరువు' పేరుతో సెంటర్ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీలను మాత్రమే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విశాఖలో భారీ పరిశ్రమలు ఉన్నందున స్టార్టప్‌లకు ఆకర్షణీయంగా ఉంటుందని ప్రభుత్వం వేసిన అంచనాలు, ప్రోత్సాహకాలు లేక వాస్తవ రూపం దాల్చడం లేదు.

విశాఖలో ఐటీ రంగం వెలవెల.. భవనాలు ఖాళీ

ABOUT THE AUTHOR

...view details