IPS Officers Transfers in Telangana : రాష్రంలో మరో 12 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే రాచకొండ కమిషనర్‌గా ట్రాన్స్‌ఫర్ మీద వెళ్లిన సుధీర్ బాబును మల్టీజోన్-2 ఐజీగా నియమించింది. హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ డీసీపీగా సాధన రష్మి పెరుమాళ్‌ను బదిలీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా బదిలీ చేసిన ఐపీఎస్‌ల వివరాలు :
- మల్టీజోన్-2 ఐజీగా రాచకొండ సీపీ సుధీర్‌బాబు
- రాచకొండ సీపీగా తరుణ్ జోషి
- రామగుండం కమిషనర్‌గా శ్రీనివాసులు
- సైబరాబాద్ ట్రాఫిక్ సంయుక్త సీపీగా జోయల్ డేవిస్
- సీఐడీ డీఐజీగా నారాయణ నాయక్
- ఆర్టీసీ విజిలెన్స్ ఎస్పీగా అపూర్వరావు
- సౌత్ వెస్ట్ జోన్ డీసీపీగా ఉదయ్ కుమార్
- ఈస్ట్ జోన్ డీసీపీగా గిరిధర్
- హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ డీసీపీగా సాధన రష్మి పెరుమాళ్
- పోలీసు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా మురళీధర్ నియామకం
- హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా సాధన రష్మి పెరుమాళ్
- పోలీసు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ నవీన్‌కుమార్ డీజీపీ కార్యాలయం
నవీన్‌కుమార్‌ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. విశ్రాంత ఐఏఎస్ ఇంటి వ్యవహారంలో నవీన్ కుమార్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
రాష్ట్రంలో 23 మంది ఐపీఎస్ అధికారులు, 21 మంది నాన్ కేడర్ ఎస్పీల బదిలీ
CM Revanth Reddy on GO Number 46 : జీవో నం.46 రద్దు సాధ్యాసాధ్యాలపై అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. పోలీసుశాఖలో ఎంపిక ప్రక్రియ పూర్తయిన 15,750 పోస్టులకు నియామకపత్రాలు అధికారులు సూచించారు. కొత్త నోటిఫికేషన్లకు సంబంధించి జీవో46 రద్దుపై అసెంబ్లీలో చర్చించి కేబినెట్ సబ్ కమిటీ ద్వారా నిర్ణయం తీసుకుందామని రేవంత్ తెలిపారు.