IOC Proposals to Make Amaravati as Piped Gas Capital:అమరావతిని పైప్డ్ గ్యాస్ రాజధానిగా తీర్చిదిద్దేలా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (Indian Oil Corporation) వెల్లడించింది. ఈ మేరకు పైప్డ్ గ్యాస్ అందించే ప్రణాళిలతో ప్రభుత్వాన్ని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రతినిధులు సంప్రదించారు. గుజరాత్లోని గిఫ్ట్ సిటీ తరహాలో అమరావతిలో పైప్డ్ గ్యాస్ అందిస్తామని ఐఓసీ వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని ఐఓసీ ప్రతినిధులకు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ తెలియచేశారు. ఆర్టీజీఎస్లో పెట్రోలియం నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు సభ్యుడు రమణకుమార్తో అధికారులు దీనికి సంబంధించిన చర్చలు జరిపారు. దీంతో పాటు రాష్ట్రంలో పైప్డ్ గ్యాస్ కనెక్షన్లు, సిటీగ్యాస్ డిస్ట్రిబ్యూషన్ పనుల పురోగతిపైనా చర్చ చోటు చేసుకుంది.
గుజరాత్ తరహాలో ఇంటింటికి పైప్డ్ గ్యాస్ - ఇకపై మన రాష్ట్రంలోనూ - AMARAVATI AS PIPED GAS CAPITAL
అమరావతిని పైప్డ్ గ్యాస్ రాజధానిగా తీర్చిదిద్దేలా ప్రతిపాదనలు - పైప్డ్ గ్యాస్ అందించే ప్రణాళికతో ప్రభుత్వాన్ని సంప్రదించిన ఐవోసీ
amaravati_as_piped_gas_capital (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 17, 2024, 10:17 PM IST