Inter Student Murdered 7th Class Boy :కుటుంబం, సమాజం, మానసిక సంఘర్షణ. ఈ మూడు అంశాలతో ఇమడలేక బాల్యం సతమతమౌతోంది. అందుకే తెలిసి తెలియని వయసులో మనసు పాడు చేసుకోని నేరాలకు పాల్డడుతున్నారు చిన్నారులు. తాను అనుకున్నది జరగలేదనే కోపంతో విద్యార్థి మరో విద్యార్థిని హత్య చేశాడు.
తోటి విద్యార్థినిపై మనసు పడ్డాడు. కౌమార దశలోనే ప్రేమంటూ భ్రమించాడు. తన ఇష్టానికి అక్షర రూపమిస్తూ ఓ లేఖ రాశాడు. ఆమెకు అందించాలని ఓ బాలుడిని పురమాయించాడు. తిరస్కరణతో ఉన్మాదిగా మారి అతని ప్రాణాలు తీశాడు. ఈ దుర్మార్గం అర్థవీడు పోలీసు స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో 2018 జులైలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ముగ్గురి పేర్లూ ఒకటే- మద్యం మత్తులో ఒకరి హత్య- అసలేంజరిగిందంటే!
ఒంగోలులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల పక్క పక్కనే ఉంటాయి. జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న ఓ విద్యార్థి తన తోటి విద్యార్థినికి ఓ ప్రేమలేఖ రాశాడు. ఆమెకు అందించేందుకు పక్క పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న ఓ బాలుడిని ఎంచుకున్నాడు. అ చిన్నారి ప్రేమ లేఖ ఇచ్చేందుకు నిరాకరించాడు. దీంతో సదరు విద్యార్థి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బాలుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు అతన్ని వెంటనే కంభం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి అదే నెల 13న ప్రాణాలు వదిలాడు.
ప్రేమోన్మాది దాడిలో యువతి మృతి - అనంతరం యువకుడు ఆత్మహత్యాయత్నం - HYDERABAD MAN KILLS EX GIRLFRIEND
ఈ ఉదంతంపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సాక్ష్యాధారాలతో న్యాయ స్థానంలో ప్రవేశపెట్టారు. నేరం రుజువైనందున శిక్షలో భాగంగా ఆ బాలుడు మూడు సంవత్సరాల కాల వ్యవధిలో ఏడాది పాటు ఏదైనా ప్రభుత్వ వైద్యశాలలో సామాజిక సేవ చేయాలని ఒంగోలు రెండో అదనపు మున్సిఫ్ కోర్టు మేజిస్ట్రేట్, జువైనల్ జస్టిస్ బోర్డు ఛైర్మన్ పి.భాను సాయి శుక్రవారం తీర్పు చెప్పారు. దర్యాప్తులో క్రియాశీలంగా వ్యవహరించిన పోలీసులను జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ అభినందించారు.
భార్యను నీటిలో ముంచి చంపిన భర్త - ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు పక్కా ప్లాన్ - ఇంతలో సీన్ రివర్స్! - Husband killed his wife