India Today Axis My India Exit Poll Over AP Results :ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమిదే అధికారమని, ఇండియా టుడే- మై యాక్సిస్ కూడా తేల్చిచెప్పింది. ఇప్పటికే దాదాపు అన్ని కీలక సర్వేలు కూటమికే మొగ్గుచూపిన సంగతి తెలిసిందే. లేటెస్ట్గా ఈ జాబితాలోకి ఇండియా టుడే- మై యాక్సిస్ కూడా చేరింది.
టీడీపీ సొంతంగా 78 నుంచి 96 స్థానాల్లో విజయం సాధిస్తుందని, మిత్రపక్షాలు జనసేన 16 నుంచి 18 స్థానాల్లో, బీజేపీ 4 నుంచి 6 స్థానాల్లో గెలుపొందుతాయని అంచనా వేసింది. మొత్తంగా ఎన్డీఎ కూటమికి 98 నుంచి 120 సీట్లు వస్తాయని ఇండియా టుడే- మై యాక్సిస్ పోస్ట్పోల్స్ ప్రకటించింది. ఇక అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీకు మాత్రం 55 నుంచి 77 స్థానాలు వస్తాయని జోస్యం చెప్పింది. అలానే కాంగ్రెస్ పార్టీ 0 నుంచి 2 సీట్లు సాధిస్తుందని తెలిపింది.
ఏపీలో అధికారం కూటమిదే : ఆంధ్రప్రదేశ్లో హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి తిరుగులేని విజయాన్నందుకోబోతున్నట్లు వివిధ సర్వే సంస్థలు స్పష్టం చేశాయి. ఏడు దశల సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగియడంతో, ఎగ్జిట్ పోల్స్ అంనచాలు వెల్లడించాయి. పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ లెక్క ప్రకారం కూటమిలో అతిపెద్ద పార్టీగా ఉన్న తెలుగుదేశం ఒక్కటే 95 నుంచి 110 స్థానాలు గెలుచుకోనుంది.
కూటమి మిత్రపక్షాలైన జనసేన 14 నుంచి 20 సీట్లు, బీజేపీ 2 నుంచి 5 సీట్లు దక్కించోవచ్చని తెలిపింది. ఇక అధికార వైఎస్సార్సీపీ 45 నుంచి 60 స్థానాలకే పరిమితం కాబోతుందని స్పష్టం చేసింది! సార్వత్రిక ఫలితాల్లోనూ అదే ఒరవడి కొనసాగుతుందని పీపుల్స్ పల్స్ సర్వే లెక్కలు వేసింది. తెలుగుదేశం 13 నుంచి 15, జనసేన 2, కమలం పార్టీ 2 నుంచి 4 సీట్లు కైవసం చేసుకోనుండగా, వైఎస్సార్సీపీ 3 నుంచి 5 స్థానాలకు పరిమితం అవుతుందని వెల్లడించింది.