Telangana Weather Report Today :వచ్చే రెండు రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు రంగారెడ్డి, నాగర్ కర్నూల్, మహబూబ్నగర్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలలో సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని సూచించింది. రేపు వర్షపాతం తగ్గి అక్కడక్కడ సాయంత్రం వేళ ఉరుములు మెరుపులతో కూడిన వర్ష పాతం నమోదయ్యే అవకాశం ఉందని, భారీ వర్ష సూచన ఏమీ కనిపించడం లేదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
మే 20 తర్వాత గరిష్ట ఉష్ణోగ్రతలు : మే 12వ తేదీన మాత్రం రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నాలుగు రోజుల పాటు వాతావరణం చల్లబడే అవకాశం ఉందని, ఆదిలాబాద్ మంచిర్యాల, నిర్మల్ మినహా రాష్ట్రం మొత్తం మీదుగా 36 నుంచి 40 డిగ్రీలు మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. మే 15 తేదీ వరకు ఇలాంటి పరిస్థితే నెలకొని ఉంటుందని చెప్పారు. మే 20వ తేదీ తర్వాత రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది.
Rain Fall in hyderabad :మరోవైపు రాష్ట్రంలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇదే సమయంలో ఉరుములు మెరుపులతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలున్నాయని తెలిపింది. రేపు ఎల్లుండి దాదాపుగా ఇదే పరిస్థితి కొనసాగనుందని, ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని పేర్కొంది.