తెలంగాణ

telangana

ETV Bharat / state

సర్కార్​కు షాక్, పడిపోయిన రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం - హైడ్రా ఎఫెక్ట్ ఏమైనా ఉందా? - REGISTRATION REVENUE DECREASED

భారీగా పడిపోయిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం - పెరగాల్సింది పోయి రూ.300 కోట్ల ఆదాయానికి గండి

Registration Revenue Decreased In Telangana
Registration Revenue Decreased In Telangana (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 7, 2024, 5:48 PM IST

Updated : Oct 7, 2024, 7:30 PM IST

Registration Revenue Decreased In Telangana : తెలంగాణ రాష్ట్రంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ ఆదాయం సెప్టెంబర్‌ నెలలో భారీగా పడిపోయింది. హెడ్రా ఇష్యూ కూడా రిజిస్ట్రేషన్లు తగ్గడానికి కారణంగా భావిస్తున్నారు. గత నెలలో ఏకంగా 26 శాతానికిపై రాబడి, 20శాతం రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గినట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకు ఆరు నెలల్లో గత ఏడాది కంటే రాబడి పెరగాల్సి ఉండగా ఏకంగా రూ.300కోట్లకుపైగా ఆదాయం పడిపోయింది.

వ్యవసాయ భూములు విక్రయాలు తగ్గడంతో :తెలంగాణ రాష్ట్రంలో 2024-25 ఆర్థిక ఏడాదిలో స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ నుంచి రూ.18,500 కోట్లు ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఆ మేరకు ఆ శాఖకు లక్ష్యంగా కూడా నిర్దేశించింది. కానీ గడిచిన ఆరు నెలల్లో వచ్చిన ఆదాయం చూస్తే ఆశించిన మేర రాలేదని స్పష్టం అవుతోంది. స్థిరాస్తి క్రయవిక్రయాలతో పాటు వ్యవసాయ భూముల అమ్మకాలు, కొనుగోళ్లు కూడా పడిపోయాయి.

గతేడాది కంటే పోలిస్తే భారీగా తగ్గిన రిజిస్ట్రేషన్లు : ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకు 6 నెలల్లో 43వేలు వ్యవసాయ రిజిస్ట్రేషన్లు, 40వేలకుపైగా వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు తగ్గినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో వ్యవసాయ భూములు క్రయవిక్రయాలు తగ్గడంతో రూ.121.49 కోట్లు రాబడి తగ్గగా వ్యవసాయేతర భూములు, భవనాలు క్రయవిక్రయాలు తగ్గినా ఆదాయం మాత్రం రూ.154 కోట్లు పెరిగింది. ఇక్కడ వ్యవసాయ, వ్యవసాయేతర క్రయవిక్రయాలు తీసుకుంటే గత ఏడాది ఆరు నెలల కంటే 80వేలకుపైగా రిజిస్ట్రేషన్లు తగ్గినా ఆదాయం మాత్రం రూ.32 కోట్లు అదనంగా వచ్చింది.

రిజిస్ట్రేషన్‌ మార్కెట్ విలువల పెంపుపై ఫోకస్ - పొరుగు రాష్ట్రాల్లో అధ్యయనం - TG GOVT ON REGISTRATIONS INCOME

జనవరి నుంచి సెప్టెంబర్‌ వరకు నెలల వారీగా జరిగిన డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ల సంఖ్య, తద్వారా వచ్చిన ఆదాయాలను పరిశీలిస్తే ఏప్రిల్‌లో 1.22 లక్షలు డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరిగి తద్వారా రూ.1,045 కోట్లు, మే నెలలో 1.46లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరిగి తద్వారా రూ.965 కోట్లు, జూన్‌ నెలలో 1.67లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరిగి తద్వారా రూ.1,129.53 కోట్లు, జులైలో 2.04లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లకు రూ.1,531.32 కోట్లు రాబడి వచ్చింది.

ఒక్క నెలలోనే తగ్గిన రూ.300కోట్ల రాబడి : ఆగస్టు ఒకటో తేదీ నుంచి మార్కెట్‌ విలువలు పెరుగుతాయని విస్తృతంగా ప్రచారం జరగడంతో అత్యధికంగా డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరిగాయని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చెబుతున్నారు. ఆ తరువాత ఆగస్టులో 1.49లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరిగి తద్వారా రూ.1,071.29 కోట్ల ఆదాయం వచ్చింది. ఇక సెప్టెంబరు నెలలో 1.30లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరిగి తద్వారా రూ.770.36 కోట్లు మాత్రమే ఆదాయం చేకూరింది. ఒక్క సెప్టెంబర్‌ నెలలోనే ఏకంగా మూడు వందల కోట్లకు పైగా రాబడి ప్రభుత్వం కోల్పోయింది. పెరగాల్సింది పోయి తగ్గడంతో రాబడులపై ఆ ప్రభావం చూపుతుంది.

మొత్తంగా ఈ ఆర్థిక ఏడాది ఇప్పటి వరకు 9.18లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు ద్వారా రూ.6,512.63 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చింది. ఈ ఆర్థిక ఏడాదిలో రాబోయే ఆరు నెలలు ఇదే పరిస్థితి కొనసాగితే ఈ ఆర్థిక ఏడాదిలో ఆదాయం రూ.13వేల కోట్లకు మించే అవకాశం లేదని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మాత్రం చేరుకునే అవకాశం లేదని తేల్చేస్తున్నారు అధికారులు.

ఆర్వోఆర్ చట్టం తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు :మరోవైపు స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖలో వేళ్లూనుకుపోయిన అధికారులను బదిలీ చేసే కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటికే జిల్లా రిజిస్ట్రార్లను కొందరని బదిలీ చేసిన ప్రభుత్వం మిగిలిన అధికారులకు సంబంధించి కూడా పరిశీలన చేస్తున్నారు. మరోవైపు రిజిస్ట్రేషన్‌ మార్కెట్‌ విలువలు పెంచేందుకు, ఆర్వోఆర్‌ చట్టం తీసుకురావడానికి ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది.

4 నెలల్లో రూ.5,126.77 కోట్ల ఆదాయం - ఐదేళ్లలో తొలిసారి పెరిగిన రాబడి - TG REGISTRATIONS REVENUE INCREASED.

భూముల ధరల పెంపుపై సర్కార్ కసరత్తు - దాదాపు రూ.4 వేల కోట్ల అదనపు రాబడి వస్తుందని అంచనా - TG Govt To Increase Land Price 2024

Last Updated : Oct 7, 2024, 7:30 PM IST

ABOUT THE AUTHOR

...view details