Karthika Vanabhojanalu 2024 :ఆటపాటలతో సందడిచేసే గార్డెన్ పార్టీని నిర్వహించేందుకు ముందస్తుగా ప్లాన్ వేసుకుంటాం. చెట్ల నీడన సరదాగా కలిసి భోజనం చేయడం, ఆటవిడుపుగా ఓరోజు హితులు, ఇరుగుపొరుగుతో గడిపే వనభోజనాలంటే ఇష్టపడని వారెవరుంటారు చెప్పండి? అందుకే కార్తిక మాసంతోనే పరిమితం కాకుండా. డిసెంబరు నెల చివరి వరకు పిక్నిక్లు జరుగుతూనే ఉంటాయి. ఈ వనభోజనాల్లో ఎన్నో సాంస్కృతిక, సామాజిక, శాస్త్రీయ, వైజ్ఞానిక అంశాలు ఉంటాయి.
శాస్త్రం ఏం చెబుతోందంటే :రకరకాల ఫల, పుష్ప, వృక్ష జాతులున్నటువంటి తోటలను వనభోజనాల కోసం ఎంచుకోవాలి. అక్కడ ఉసిరి చెట్టు తప్పనిసరిగా ఉండాలి. దానికి సమీపంలోనే ఆహార పదార్థాలు వండుకోవాలి. ఉసిరి చెట్టుకింద కార్తిక దామోదరునికి పూజలు నిర్వహించాలి. ఆ తర్వాత పనస ఆకులో ఆహారాన్ని తీసుకోవాలి. ఇది శాస్త్రం చెప్పినటువంటి ప్రక్రియ.
ఆరోగ్య ప్రయోజనాలివే :వనభోజనం విందు తోటలో చేయడమే అనుకుంటే పొరపాటే. ఈ ఆచారం వెనుక ఆరోగ్యకరమైన ఓ పద్దతి కూడా ఉంది. ఆయుర్వేద గుణాలున్నటువంటి మొక్కల నుంచి వచ్చేగాలి అనేక వ్యాధుల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఉసిరి చెట్టుకింద కూర్చొని భోజనం చేసే క్రమంలో పీల్చే గాలితో పైత్యప్రకోపం తగ్గుతుంది. ఉసిరికి ఉండే విటమిన్ సి రక్తప్రసరణలోని ఇబ్బందులు, ఎసీడీటీ వంటి రుగ్మతలకు మందు అవుతుంది. జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుంది.
వానలు తగ్గి చలి అందుకొనే సంధికాలం కార్తిక మాసం. ఈ సమయంలో శ్వాస సంబంధిత వ్యాధులు ఇబ్బంది పెడుతుంటాయి. వనభోజనం కారణంగా ఎదులాబాద్ రంగనాయకస్వామి ఆలయం గాలి ఔషధంలా పనిచేస్తుంది.