తెలంగాణ

telangana

ETV Bharat / state

అల్పపీడన ప్రభావంతో భారీగా ఈదురుగాలులు - ఇవాళ, రేపు తేలిక నుంచి మోస్తరు వర్షాలు - TELANGANA WEATHER UPDATES

బంగాళాఖాతంలో బలహీనపడుతున్న అల్పపీడనం - ఆ ప్రభావంతో ఉపరితల ఆవర్తనం - తెలంగాణలో ఇవాళ, రేపు మోస్తరు వర్షాలు

Telangana Weather Updates
Telangana Weather Updates (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 26, 2024, 4:58 PM IST

Updated : Dec 26, 2024, 5:04 PM IST

Telangana Weather Updates :బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం క్రమంగా బలహీనపడుతోంది. అల్పపీడనం బలహీనంగా మారిందని విశాఖ వాతావరణ శాఖ అధికారి సుధావల్లి తెలిపారు. దీని ప్రభావంతో 1.5 కిలో మీటర్ల మేర ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు పేర్కొన్నారు. అల్పపీడన ప్రభావంతో తీరం వెంబడి గంటకు 65 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్​లోని అన్ని పోర్టుల వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు చెప్పారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. వచ్చే 24 గంటలు నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని పేర్కొన్నారు. రానున్న రెండ్రోజులు రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

తెలంగాణపైనా ఉపరితల ఆవర్తన ప్రభావం :బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావం తెలంగాణ పైనా కనిపిస్తోంది. ఉత్తర, ఈశాన్య గాలుల ప్రభావం వల్ల రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని హైదారాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపారు. ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఆయన చెప్పారు. మరోవైపు ఉపరితల ఆవర్తన ప్రభావంతో భాగ్యనగరంలో పలు ప్రాంతాల్లో నిన్నటి నుంచి చిరు జల్లులు పడుతున్నాయి.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీన పడుతుండడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో చల్లటి గాలులు వీస్తున్నాయి. ఉదయం హుస్సేన్ సాగర్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో మంచుతెరలతో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడింది. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో వచ్చిన పర్యాటకులు చిరు జల్లులను ఆస్వాదించారు. సెలవు రోజు కావడంతో రద్దీ పెరిగింది.

సాయంత్రం అబిడ్స్, కోఠి, ఖైరతాబాద్, నాంపల్లితో పాటు సికింద్రాబాద్ పరిధిలోని బోయిన్​పల్లి, తిరుమలగిరి, అల్వాల్, చిలకలగూడ, జవహర్ నగర్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. రంగారెడ్డి జిల్లా షాద్​నగర్ పట్టణంతో పాటు నియోజకవర్గంలోని వానపడింది. అటు యాదాద్రిలోనూ రోజంతా చిరుజల్లులు కురుస్తూనే ఉన్నాయి. చల్లని గాలుల మధ్యే భక్తులు స్వామి వారి దర్శనం కోసం తరలివచ్చారు. నిన్న, ఇవాళ సెలవు రోజులు కావడంతో వర్షంలోనూ భక్తులు భారీగా తరలివచ్చారు.

రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు! - ఆ జిల్లాలకు వర్ష సూచన

తీవ్ర అల్పపీడనం బలహీనపడే అవకాశం - ఆ జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు పిడుగులు

Last Updated : Dec 26, 2024, 5:04 PM IST

ABOUT THE AUTHOR

...view details