Illegal Products Frauds In Hyderabad :సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉంటున్నా, ఈ కేటుగాళ్లు ఈజీగా బురిడీ కొట్టించేస్తున్నారు. రకరకాల పేర్లు చెప్పి బాధితుల నుంచి డబ్బులు దండుకుంటున్నారు. సైబర్‌మాయగాళ్ల చేతిలో మోసపోతున్న కేసులు రోజుకు కనీసం పదుల సంఖ్యలో వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా సికింద్రాబాద్లోని ఒక వ్యక్తికి సైబర్ నేరగాళ్లు కాల్ చేసి తాము ముంబై పోలీసులమని మీపేరు మీద వచ్చిన పార్శిల్‌లో అక్రమ ప్రొడక్ట్స్ ఉన్నాయని గోప్యంగా ఉంచడానికి రూ. 19 లక్షల 39 వేలు ట్రాన్స్ఫర్ చేయాలని సూచించారు. అనుమానంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఆర్మీ పేరుతో దోపిడీ.. సైబర్ నేరగాళ్ల నయా మోసాలు
Cyber Cheating Illegal Products In Hyderabad : హైదరాబాద్ నగరానికి చెందిన ఓ వ్యక్తిని మోసం చేసేందుకు సైబర్ నేరగాళ్లు యత్నించారు. అతను అప్రమత్తతతో సైబర్ క్రైంపోలీసులను ఆశ్రయించారు. సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల బాధితుడికి ఇటీవలె సైబర్ నేరగాళ్లు ముంబయి పోలీసులు అని చెప్పి కాల్ చేశారు. అతని ఆధార్ వివరాల ద్వారా పార్శిల్ వచ్చిందని నమ్మించారు. ఆ పార్శిల్‌లో అక్రమ ప్రొడక్ట్స్ వచ్చాయని వాటిని ముంబయి కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.