What To Do If Snake Enters The Home :సాధారణంగా పాము పేరు వింటేనే కొంతమందికి ఒంట్లో భయం పుడుతుంది. అదే ఇంట్లోనో లేదా మన ఎదురుగానో ప్రత్యక్షమైతే ఆ పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంటుంది. ఏదైనా కారణం వల్ల మీ ఇంట్లోకి పాము ప్రవేశించినట్లయితే కంగారు పడొద్దు. 'ఫ్రెండ్స్ స్నేక్ సొసైటీ' వారి ఫోన్ నెంబర్కు సంప్రదిస్తే సరిపోతుంది. వారు సర్పాన్ని బంధించి తీసుకుని వెళ్లి జనారణ్యం లేని ప్రాంతాల్లో విడిచిపెడతారు.
మీ ఇంట్లోకి పాము ప్రవేశిస్తే ఇలా చేయండి :హైదరాబాద్ నగరంలో ప్రధానంగా సేవలు అందిస్తున్నటువంటి ‘ఫ్రెండ్స్ స్నేక్ సొసైటీ’ ఫోన్ నెంబర్ 83742 33366. ఈ సంస్థకు చెందిన 120 మందికి పైగా వాలంటీర్లు నగరంలో పలు ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నారు. నగరంలో ఎక్కడి నుంచి ఫోన్ వచ్చినా, అరగంట వ్యవధిలోనే (30 నిమిషాల) చేరుకుంటారని స్నేక్ సొసైటీ వారు చెబుతున్నారు.
స్నేక్ క్యాచర్స్ సేవలు :హయత్‌నగర్ ప్రాంతానికి చెందిన సింధూ గృహిణి. తనకు ఇంట్లో పాము కనిపించగానే భయంతో వెంటనే భర్తకు కాల్ చేసి చెప్పింది. ఆయనకు సోషల్ మీడియాలో చూసిన ‘స్నేక్ క్యాచర్స్ వెంటనే’ గుర్తుకువచ్చారు. వారికి సంప్రదించడంతో వారు వచ్చి పామును చాకచక్యంగా పట్టుకుని ఓ డబ్బాలో బంధించి జనారణ్యం లేని ప్రాంతంలో విడిచిపెట్టారు.