Hydra Commissioner Ranganath on Demolitions : అక్రమ నిర్మాణాలపైనే హైడ్రా చర్యలుంటాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. ఈటీవీ నిర్వహించిన ఫోన్-ఇన్ కార్యక్రమలో ప్రజలు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. చెరువులకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో అందుబాటులోకి తెస్తామన్నా ఆయన గూగుల్ మ్యాప్స్ ద్వారా బఫర్‌జోన్‌లు తెలుసుకునే అవకాశం ఇస్తామని తెలిపారు.
ఆ భవనాలు ఎలాంటి పరిస్థితుల్లో కూల్చం : హైడ్రా ఏర్పాటుకు ముందు ఇచ్చిన అనుమతులు చెల్లుతాయని, ఆ నిర్మాణాలను కూల్చబోమని స్పష్టం చేశారు. హైడ్రా ఏర్పాటు తర్వాత జరుగుతున్న అక్రమ నిర్మాణాలు కూల్చుతామని పునరుద్ఘాటించారు. కాలనీ సంఘాలు చేస్తున్న ఫిర్యాదులకు తొలి ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఎఫ్‌టీఎల్‌లో ప్రజలు నివాసం ఉంటున్న భవనాలు కూల్చమని తెలిపారు. ప్రజలు నివాసం ఉంటున్న ఎలాంటి భవనాలు కూల్చబోమన్న ఆయన అక్రమ నిర్మాణాలపైనే హైడ్రా చర్యలు ఉంటాయని అన్నారు.
శాటిలైట్ చిత్రాలతో కబ్జాలకు చెక్ - ఎన్‌ఆర్‌ఎస్‌సీ సాయం తీసుకోనున్న హెడ్రా
"గూగుల్ మ్యాప్స్ ద్వారా బఫర్‌జోన్‌లు తెలుసుకునే అవకాశం ఇస్తాం. హైడ్రా ఏర్పాటుకు ముందు ఇచ్చిన అనుమతులు చెల్లుతాయి. హైడ్రా ఏర్పాటు తర్వాత జరుగుతున్న అక్రమ నిర్మాణాలు కూల్చుతాం. కాలనీ సంఘాలు చేస్తున్న ఫిర్యాదులకు తొలి ప్రాధాన్యత. ఎఫ్టీఎల్‌లో ప్రజలు నివాసం ఉంటున్న భవనాలు కూల్చం. ప్రజలు నివాసం ఉంటున్న ఎలాంటి భవనాలు కూల్చబోం. అక్రమ నిర్మాణాలపైనే హైడ్రా చర్యలు ఉంటాయి. " - రంగనాథ్, హైడ్రా కమిషనర్
వాటిని గుర్తించడానికి జీఎన్‌ఐ, ఎన్‌ఆర్‌ఎస్‌సీ సహకారం : అనధికార నిర్మాణాలు ఎప్పటికైనా ప్రమాదమేనని రంగనాథ్ అన్నారు. సూరత్‌లో 45 ఏళ్ల తర్వాత కూడా అక్రమ నిర్మాణాలు కూల్చారని గుర్తు చేశారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయని తెలిపారు. కూలగొట్టడం ఒక్కటే హైడ్రా పని కాదని 12 చెరువుల పునరుద్ధరణ చేపడుతున్నట్లు వివరించారు. పార్కుల కబ్జాలపై వేలాది ఫిర్యాదులు వస్తున్నాయన్నా ఆయన ఇప్పటికే ఎన్నో పార్కులు కాపాడామని తెలిపారు. ఓఆర్‌ఆర్ లోపలే హైడ్రా పరిధి ఉందన్నారు. చెరువుల సంరక్షణ కోసం జీఎస్‌ఐ, ఎన్‌ఆర్‌ఎస్‌సీ సహకారం కూడా తీసుకుంటున్నట్లు చెప్పారు.
'జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇక నుంచి కూల్చివేతలు ఉండవు' - కీలక ప్రకటన చేసిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
ఆ కట్టడాలను హైడ్రా కూల్చదు - రంగనాథ్ మరో కీలక ప్రకటన