తెలంగాణ

telangana

ETV Bharat / state

అమ్మాయిలు వీళ్లతో జర పైలం - ఉద్యోగం ఇప్పిస్తామంటే నమ్మారో వ్యభిచార ఊబిలో ఇరుక్కునట్టే!! - PROSTITUTION RACKET BUSTED IN HYD - PROSTITUTION RACKET BUSTED IN HYD

Hyderabad Police Bust Prostitution Racket : హైదరాబాద్​లో వ్యభిచారం దందా నడుపుతున్న అయిదుగురిని పోలీసులు అరెస్ట్​ చేశారు. ఉద్యోగరీత్యా నగరానికి వస్తున్న యువతులనే టార్గెట్​ చేసి వ్యభిచార ఊబిలోకి దింపుతున్నారు.

Prostitution Racket Arrested in Hyderabad
Hyderabad Police Bust Prostitution Racket (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 14, 2024, 11:30 AM IST

Prostitution Racket Arrested in Hyderabad :హైదరాబాద్​లో హైటెక్ విధానంలో వ్యభిచార దందా చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నలుగురు నిర్వాహకులు, ఒక విటుడిని అరెస్టు చేశారు. ఆరుగురు యువతులను రక్షించారు. అయితే వ్యభిచార గృహం నిర్వాహకురాలిపై గతంలో 16 కేసులున్నాయి. టాస్క్​ఫోర్స్​ డీసీపీ సాధన రష్మీ పెరుమాళ్​ గురువారం మీడియాకు కేసు గురించి పలు వివరాలు వెల్లడించారు.

నిరుద్యోగ యువతులే వీరి టార్కెట్​ :విజయవాడకు చెందిన కె.సూర్యకుమారి (38) ఈ వ్యభిచారి ముఠాకు లీడర్​. పది మారు పేర్లతో చలామణి అవుతున్న ఆమె నగరంలోని మధురానగర్​లో నివసిస్తోంది. తిరుపతికి చెందిన కె. విజయశేఖర్​ రెడ్డి (49) అక్కడే ఉండేవాడు. వీరుద్దరూ కలిసి నగరంలో వ్యభిచార గృహాలు నిర్వహించేవారు. 2020లో పీడీ యాక్టు కింద జైలుకు పంపినా తీరు మారలేదు.

Massage Centers Seized in Banjarahills : మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం.. నిర్వాహకుల అరెస్ట్

సూర్యకుమారి, విజయ శేఖర్‌రెడ్డి ఏపీ, పశ్చిమబెంగాల్, త్రిపుర తదితర రాష్ట్రాల తదితర రాష్ట్రాలకు చెందిన యువతులకు డబ్బు, ఉద్యోగాల ఆశ చూపి నగరానికి తీసుకొచ్చే వారు. అనంతరం వారిని వ్యభిచార రొంపిలోకి దింపి సొమ్ము చేసుకునేవారు. శేఖర్‌రెడ్డి కస్టమర్ల డేటాను ఒక యాప్‌లో ఉంచగా కస్టమర్లు వారికి కావాల్సిన యువతిని బుక్ చేసుకుంటారు. యాప్ ఆధారంగా కస్టమర్లు చెప్పిన ప్రాంతాలు, హోటళ్లకు యువతులను తీసుకెళ్తారు. సూర్యకుమారి కస్టమర్ల నుంచి క్రెడిట్, డెబిట్‌ కార్డుల ద్వారా డబ్బు తీసుకుంటోంది.

గురువారం పంజాగుట్ట ఠాణా పరిధిలోని పార్క్​ హోటల్​లో పశ్చిమ మండల టాస్క్​ఫోర్స్​ పోలీసులు సోదా చేశారు. గండిపేటకు చెందిక కిలారు కీర్తితేజ (29), ఓ యువతి పట్టుబడ్డారు. వారిద్దరి దగ్గర నుంచి ముఠాకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. వేర్వేరు ప్రాంతాల్లో తనిఖీ చేసి తనిఖీచేసి సూర్యకుమారి, శేఖర్‌రెడ్డి, వారికి సహకరిస్తున్న పశ్చిమబెంగాల్‌ వాసి అర్కోజిత్‌ ముఖర్జీ(30), తిరుపతికి చెందిన వేణుగోపాల్‌ బాలాజీ(50)ని అదుపులోకి తీసుకుని పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు.

ఇటీవల ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. డబ్బులు ఆశపడి నిరుద్యోగ యువతులు, మైనర్లను వ్యభిచార ఊబిలోకి దింపి దందా నడిపిస్తున్నారు. ఈ మధ్యకాలంలో జగిత్యాల శివారు చల్గల్​కు చెందిన కొందరు ముఠా సభ్యులు, పాఠశాలలో చదువుకునే మగ పిల్లల ద్వారా మత్తు పదార్థాలు స్కూళ్లోకి చేరవేసి ఆడ పిల్లలకు వాటిని అలవాటు చేస్తున్నారు. మత్తు పదార్థాలకు బానిసలైన జగిత్యాల పట్టణానికి చెందిన బాలికలను ఇటీవల హైదరాబాద్​లోని ఓ రేవ్ పార్టీకి కూడా తీసుకెళ్లినట్లు వెలుగులోకి వచ్చింది.

మానవ అక్రమ రవాణాపై ఎన్​ఐఏ కొరఢా - మయన్మార్, బంగ్లాదేశ్‌ గుండా దేశంలోకి ఏజెంట్లు

బాలికలకు డ్రగ్స్​ అలవాటు చేసి రేవ్​ పార్టీల్లో వ్యభిచారం! - జగిత్యాల జిల్లాలో గంజాయి ముఠా అరాచకాలు - drug racket bust in jagtial

ABOUT THE AUTHOR

...view details