Metro Trains Delay : హైదరాబాద్ మెట్రో రైలు సేవల్లో అంతరాయం కలిగింది. సాంకేతిక కారణాలతో మియాపూర్- అమీర్‌పేట్ మధ్య మెట్రో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఫలితంగా అమీర్‌పేట్- హైటెక్ సిటీ, నాగోల్- సికింద్రాబాద్ మెట్రో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. సాంకేతిక లోపంతోనే సేవలకు అంతరాయం కలిగినట్లు తెలుస్తోంది. మెట్రో రైళ్ల ఆలస్యంతో విద్యార్థులు, ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సాంకేతిక కారణాలతోనే మెట్రో సేవల్లో జాప్యం : మెట్రోరైలు సేవల్లో అంతరాయం కలగి ఆలస్యంగా నడవడంపై మెట్రో అధికారులు స్పందించారు. సాంకేతిక కారణాలతోనే మెట్రో సేవలకు కాసేపు అంతరాయం కలిగినట్లుగా తెలిపారు. ఉదయం కొన్ని మెట్రో రైలు సర్వీసుల్లో సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయని అధికారులు వివరించారు. ప్రస్తుతం మెట్రో రైలు సేవలను పునరుద్ధరించామని తెలిపారు.