Hyderabad Has Highest Car Accidents in Last Two Years Compared to Metro Cities :ఇటీవల రోడ్డు ప్రమాదాల సంఖ్య గణణీయంగా పెరుగుతోంది. ఈ ఘటనల్లో పలువురు ప్రాణాలు కోల్పోతుండగా, ఎందరో జీవితాంతం వైకల్యంతో బతకాల్సి వస్తుంది. అయితే దేశవ్యాప్తంగా ఉన్న మెట్రో నగరాలతో పోలీస్తే గత రెండేళ్లలో హైదరాబాద్‌లోనే అత్యధిక కారు ప్రమాదాలు జరిగినట్లు ప్రముఖ వాహన బీమా సంస్థ వెల్లడించింది.
అకో ‘యాక్సిడెంట్ ఇండెక్స్-2024’ పేరుతో తాజాగా ఈ నివేదికను విడుదల చేసింది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా దేశ రాజధాని దిల్లీ, పుణె, బెంగళూరు, కోల్‌కతా, ముంబయి, చెన్నై, అహ్మదాబాద్ నగరాలున్నాయని పేర్కొంది. ఆ నివేదికలో పలు ప్రధానాంశాలను ప్రస్తావించింది.
దేశవ్యాప్తంగా 78% రోడ్డు ప్రమాదాలు మెట్రో నగరాల్లోనే జరుగుతున్నాయి :బెంగళూరు మహా నగరంలో 45% కారు ప్రమాదాలు జరుగుతున్నాయని నివేదిక స్పష్టం చేసింది. రాజధాని నగరమైన దిల్లీలో 13% జరుగుతుండగా. ముంబయిలో 12% చోటుచేసుకుంటున్నాయి. ముంబయి లో ప్రమాదాలు గుంతల కారణంగా జరుగుతున్నట్లు నివేదిక వెల్లడించింది.