Husband killed his Wife in krishna District :భార్యను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించాలని ప్రయత్నంచేశాడో ప్రబుద్దుడు. పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించండంతో తానే హత్య చేసినట్లుగా అంగీకరించాడు. భార్యను హత్య చేసిన భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం దూళ్లవానిగూడెంలో చోటుచేసుకుంది.
ఆర్థిక ఇబ్బందులతో తరచూ గొడవలు : భర్తే కాలయముడై భార్యను కడ తేర్చిన ఘటన కృష్ణా జిల్లాలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే, దూళ్లవానిగూడెం గ్రామానికి చెందిన నక్కా సునీతకు రాజేష్ అనే వ్యక్తితో కొంతకాలం క్రితం రెండో వివాహం జరిగింది. మొదటి భర్తతో గొడవల కారణంగా విడిపోయి అదే గ్రామానికి చెందిన రాజేష్‌తో రెండో వివాహం చేసుకుంది. కొంతకాలం వీరి వివాహదాంపత్యం సాఫీగానే జరుగుతుండగా ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగోక అప్పులు చేశారు. దీంతో ఇద్దరి మధ్య ఇంట్లో తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి.
భార్యను నరికి ఇంటి ముందే కత్తిపట్టుకుని కూర్చున్న భర్త- ఏలూరు జిల్లాలో దారుణం - HUSBAND KILLED WIFE
ఇంటి నుంచి వెళ్లిపోయిన భర్త : మరోవైపు అప్పుల వారి ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో భర్త రాజేష్ ఇటీవల ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దీంతో అప్పుల వారి బాధలు భరించలేక సునీత గుడివాడలోని ఓ దుకాణంలో పనికి చేరింది. వచ్చిన డబ్బులతో ఏదో రకంగా అప్పులు తీర్చుకుంటూ కాలం గడుపుతుంది. అయితే కొద్దిరోజుల క్రితం ఇంటినుంచి వెళ్లిపోయిన భర్త రాజేష్ మళ్లీ ఇంటికి తిరిగి వచ్చాడు. బుద్ధి మార్చుకోని రాజేష్ ఎప్పటిలాగే భార్య సునీతతో మళ్లీ గొడవపడ్డం మొదలుపెట్టాడు. ఇదే క్రమంలో శనివారం సునీత యథావిధిగా షాపులో పనిచేయడానికి వెళ్లింది. తిరిగి రాత్రి 8 గంటల సమయంలో గుడివాడ నుంచి ఇంటికి వెళ్లే క్రమంలో పెదపారుపూడి సెంటర్ వద్ద భర్త రాజేష్ ఆటో నిలిపి భార్య సునీతను కింది దింపాడు.
పట్టుతప్పి కింద పడిపోయిన మృతదేహం : అనంతరం రాజేష్ సునీతను ఇంటికి తీసుకుని వెళ్తున్నట్లు నటించి మార్గమధ్యలో దారుణంగా కొట్టి పంటబోదులలో ఉన్న నీటిలో ముంచి చంపాడు. భార్య సునీత చనిపోయిందని నిర్ధారించుకున్నాక ఎవరికి అనుమానం రాకుండా వాళ్లు ఉండే గ్రామంలోనే రైలు పట్టాల కింద పడుకోబెట్టి రైలు కింద పడి చనిపోయినట్లు కథను అల్లుదామని నిశ్చయించుకున్నాడు. పథకం ప్రకారమే అమలుచేసి అక్కడి నుంచి వెెళ్లిపోయాడు. అయితే అనుకోకుండా పట్టాలపై పడుకోబెట్టిన మృతదేహం పట్టుతప్పి జారి కింద పడిపోయింది. అయితే ఈరోజు రైల్వే ట్రాక్‌పై మృతదేహన్ని గుర్తించిన పోలీసులు ఎటువంటి గాయాలు లేనప్పటికి ఎలా మరణించిందనే కోణంలో విచారించారు. అనుమానంతో భర్త రాజేష్‌ని విచారించగా తానే తన భార్యను చంపినట్లు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై అనుమానాస్పద కేసు నమోదు చేసినట్లు పెదపారుపూడి ఎస్ఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
తప్పుడు పనులు వద్దన్న భర్త - వినని భార్య - ఆపై ఏం జరిగిందంటే ! - Husband Killed Wife
కానిస్టేబుల్ భర్త ఇంటి ముందే భార్య అంత్యక్రియలు- కూతురిని హత్య చేశాడని తల్లిదండ్రుల కోపం!