ఇసుకేస్తే రాలనంత జనం - టీడీపీ అభ్యర్థుల నామినేషన్లతో శ్రేణుల్లో జోష్ - వైసీపీలో నిరుత్సాహం Huge Response to TDP Nominations: తెలుగుదేశం అభ్యర్ధుల నామినేషన్లకు ఇసుక వేస్తే రాలనంతగా జనం సందోహం పోటెత్తెంది. అభ్యర్థుల నామినేషన్ల ర్యాలీ హోరెత్తి పోవడంతో శ్రేణుల్లోను ఫుల్ జోష్ నెలకొంది. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు సందడి వాతావారణంలో ఎక్కడా ఊపు తగ్గలేదు. కూటమి అభ్యర్థులతో కలిసి చాలా ప్రాంతాల్లో అట్టహాసంగా నామినేషన్ల ప్రక్రియ సాగింది.
నేటితో నామినేషన్ల ప్రక్రియ పూర్తి ముగుస్తుండటంతో అదే జోష్ కొనసాగించేందుకు నేతలు సిద్ధమయ్యారు. అధికార పార్టీలో దీనికి భిన్నమైన పరిస్థితులు ఉన్నాయనే గుసగుసలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. వైసీపీ అభ్యర్థుల నామినేషన్లలో ఉత్సాహం అంతంత మాత్రంగానే కనిపించింది. వైసీపీకి పట్టున్న నియోజకవర్గాల్లోను అదే వాతావరణం నెలకొంది.
సీనియర్ నేతలు, మంత్రుల నామినేషన్లలోనూ సందడి కనిపించకపోవటం విస్తుగొలిపింది. ప్రతిపక్ష పార్టీల్లో ఎన్నికల జోష్, అధికార పార్టీలో కనిపించని స్పందన తమకు సానుకూల సంకేతమని కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. డబ్బు వెదజల్లినా వైసీపీ అభ్యర్థుల నామినేషన్లలో ఉత్సాహం కనిపించలేదని ఆ పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశారు.
నామినేషన్ల జోరు, ప్రచార హోరు - పిఠాపురంలో జనసైనికుల సందడి - Political Nominations in Ap 2024
పల్నాడు జిల్లా మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి నామినేషన్ బుధవారం అట్టహాసంగా జరిగింది. రింగ్‌రోడ్డు ప్రాంతం నుంచి ప్రారంభమైన ర్యాలీలో వేలాదిగా కార్యకర్తలు పాల్గొన్నారు. పట్టణంలో బాణసంచా కాలుస్తూ, నృత్యాలు చేస్తూ టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు హంగామా చేశారు. ఓపెన్ టాప్ వాహనంపై బ్రహ్మారెడ్డి, నర్సారావుపేట ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, శాసన మండలి మాజీ చైర్మన్ షరీఫ్ తదితరులు అభివాదం చేశారు.
ప్రకాశం జిల్లా కనిగిరిలో ఎన్నికల నామినేషన్ల దరఖాస్తులను కోలాహలంగా అభ్యర్థులు అధికారులకు సమర్పించారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి భారీ జన సందోహం మధ్య ఊరేగింపు నిర్వహించిన అనంతరం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో నామ పత్రాలను దాఖలు చేశారు.
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా బెందాళం అశోక్ బుధవారం తన స్వగృహం నుంచి ఇచ్చాపురం తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు సమర్పించారు. కూటమి జెండాలతో హోరెత్తించారు. సుమారు 30 వేల మంది సైన్యంతో రాజపురం మీదుగా ఇచ్చాపురం తరలివచ్చారు. అశోక్‌కు దారి పొడవునా మహిళలు హారతులు ఇచ్చి పూలమాలలు వేసి నీరాజనం పలికారు. భారీగా వచ్చిన శ్రేణులు, కూటమి అభ్యర్థులతో రోడ్డు పొడవునా జన జాతరను తలపింపజేశాయి. మండుటెండను లెక్కచేయకుండా ఉత్సాహంగా ర్యాలీలో ప్రజలు పాల్గొన్నారు.
చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్ధి గురజాల జగన్మోహన్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. కలెక్టర్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. అంతకు ముందు నగరంలోని అంబేడ్కర్ విగ్రహం, గిరింపేట, దుర్గమ్మగుడి, పీవీఆర్‍కే కళాశాల మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ సాగింది. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు వేలాది మంది మధ్య అట్టహాసంగా సాగింది.
చంద్రబాబు తరపున నామినేషన్ వేసిన భువనేశ్వరి - పసుపు మయంగా మారిన కుప్పం - Chandrababu Nomination