తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు - నిండుకుండలా మారిన ప్రాజెక్టులు - Telangana Dams With Full Water - TELANGANA DAMS WITH FULL WATER

Huge Flood Water Flow To Irrigation Projects : రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులన్ని జలకళ సంతరించుకున్నాయి. భారీగా వరద నీరు చేరతుండడంతో ప్రాజెక్టు నీటిమట్టాలు పెరుగుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు.

Huge Flood Water Flow To Telangana Water Projects
Huge Flood Water Flow To Telangana Water Projects (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jul 20, 2024, 8:35 AM IST

Updated : Jul 20, 2024, 12:24 PM IST

Huge Flood Water Flow To Telangana Water Projects : రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షానికి పలు ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. భారీ వర్షాలతో తెలంగాణలోని పలు ప్రాజెక్టుల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు.

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుపోతోంది. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 31.5గా ఉంది. దీంతో అధికారులు లోతట్టు ప్రాంతాను అలర్ట్‌ చేశారు. మరోవైపు తాళిపేరు ప్రాజెక్టు 20 గేట్లు ఎత్తి 66,900 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాలైన తాళి పేరు ప్రాజెక్టు, పెరూరు వైపు నుంచి వరద నీరు రావడంతో నది నీటిమట్టం ఇంకా పెరుగుతుందని అధికారులు తెలుపుతున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు జాలారులు నదివైపు వెళ్లొద్దని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ హెచ్చరికలు జారీ చేశారు.

పెద్దవాగు ఉద్ధృతితో అశ్వారావుపేట అతలాకుతలం - స్తంభించిన జనజీవనం, ముంపు ప్రాంతాల్లో చిమ్మచీకట్లు - Heavy Floods In Bhadradri

నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టు 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1066.30 అడుగులుగా ఉంది. ఎస్సారెస్పీ నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు అయితే వరద ప్రవహానికి ప్రస్తుతం 17.662 టీఎంసీలుగా ఉంది

గద్వాల జిల్లా జూరాల ప్రాజెక్టు వరద ప్రవాహం పెరుగుతోంది. జూరాల ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 70 వేలు, ఔట్‌ఫ్లో 37,267 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుత నీటిమట్టం 317.420 మీటర్ల వరకు నీరు చేరాయి. నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 7.498 టీఎంసీలుగా ఉంది.

Bay Of Bengal Impact on Telangana :బంగాళాఖాతం దాన్ని అనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో కేంద్రీకృతమైన వాయుగుండం తెల్లవారుజామున పూరీ, చిలుకా లేక్ మధ్య తీరాన్ని దాటినట్లు హైదారాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. వాయుగుండం పశ్చిమ, వాయువ్య దిశగా కదులుతున్నట్లు తెలిపింది. వాయుగుండం తీరం దాటడంతో ఆ ప్రభావం ఎక్కువగా ఒడిశా, ఛత్తీస్‌గడ్‌లపైన చూపనున్నట్లు వెల్లడించింది.

తెలంగాణ రాష్ట్రంలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శనివారం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అక్కడక్కడా అత్యంత భారీ వానలు పడతాయని పేర్కొంది. హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై సాయంత్రం వరకు నిర్విరామంగా మోస్తరు వర్షం కురవనున్నట్లు చెప్పింది.

'మా పశువులన్నీ కొట్టుకుపోయాయి - వరద రావడంతో కొండపైన తలదాచుకున్నాం' - Peddavagu Project water leaked

Last Updated : Jul 20, 2024, 12:24 PM IST

ABOUT THE AUTHOR

...view details