HUDCO Agreed Give Loan Construction of Tidco Houses in AP : టిడ్కో ఇళ్ల నిర్మాణంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏర్పడిన అడ్డంకులు క్రమంగా తొలగిపోతున్నాయి. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారం చేపట్టి నెల రోజులు అవ్వకముందే టిడ్కో ఇళ్ల విషయంలో కీలక ముందడుగు పడింది.రూ. 2 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు హడ్కో ముందుకు వచ్చింది.
అప్పట్లో రుణమిచ్చేందుకు ససేమిరా :టిడ్కో ఇళ్ల నిర్మాణానికి హడ్కో రుణం తీసుకునేందుకు రెండేళ్లుగా అధికారులు ప్రయత్నించారు. కానీ ఒక్క రూపాయీ ఇవ్వలేదు. బ్యాంకులూ వెనకడుగు వేశాయి. ప్రభుత్వమూ నిధులు కేటాయించలేదు. దీనికి జగన్ అనుసరించిన విధానాలే కారణం. ఫలితంగా 2 లక్షల 62 వేల గృహాలను పూర్తిచేయాల్సి ఉండగా ఎన్నికల నాటికి లక్షా 45 వేల ఇళ్లనే పూర్తిచేసి లబ్ధిదారులకు అప్పగించారు. వీటిలోనూ 90% పైగా 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో చాలావరకు పూర్తయినవే. టీడీపీ కట్టిన ఇళ్లకే వైఎస్సార్సీపీ రంగులేసి అప్పగించారు.
మంత్రి గారి శ్రమదానం- స్వయంగా కొడవలి చేతబట్టి పిచ్చి మొక్కల తొలగింపు - YCP Fraud In Tidco Houses
వైఎస్సార్సీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్లపై రివర్స్ టెండరింగ్ నిర్వహించడం, తెచ్చిన అప్పుల్ని వేరే అవసరాలకు మళ్లిస్తోందనే భావనతో అప్పట్లో రుణాలిచ్చేందుకు హడ్కో, బ్యాంకులు, ఇతర వాణిజ్య సంస్థలు ఆసక్తి చూపలేదు. రుణానికి గ్యారంటీ ఇస్తామని జగన్ ప్రభుత్వం చెప్పినా సమ్మతించలేదు. తాజాగా రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన వెంటనే టిడ్కో ఇళ్ల పూర్తికి రుణం అందించేందుకు హడ్కో సానుకూలత వ్యక్తం చేసింది. రూ. 2 వేల కోట్ల అప్పు ఇచ్చేందుకు సమ్మతించింది. దీంతో టిడ్కో ఇళ్లకు ఇక మంచి రోజులు రానున్నాయి.