How To Use Western Toilet : మారుతున్న కాలానికి అనుగుణంగా మనం వాడే వస్తువుల విషయంలో ఎన్నో మార్పులువచ్చాయి.. వస్తున్నాయి.. వస్తూనే ఉంటాయి! తిని, తాగే వస్తువుల నుంచి.. వాష్ రూమ్లో వినియోగించే ఐటమ్స్ వరకూ ఎన్నో ఛేంజెస్ వచ్చాయి. ఒకప్పుడు విదేశాల్లో మాత్రమే ఉపయోగించే వెస్ట్రన్ టాయిలెట్లు.. ఇప్పుడు మన దేశంలో విరివిగా వాడేస్తున్నారు. నేడు కొత్తగా నిర్మించుకుంటున్న ఇళ్లలో దాదాపుగా అన్నీ అవే టాయిలెట్స్ వాడుతున్నారు.
ఈ వెస్ట్రన్ టాయిలెట్ల వాడకం అనేది పల్లెటూర్లతో పోల్చితే.. పట్టణాలు, నగరాల్లో ఎక్కువగా ఉంది. ఇళ్లతోపాటు ఆఫీసులు, పబ్లిక్ ప్లేసుల్లో కూడా ఇవే ఎక్కువగా ఉంటున్నాయి. వీటివల్ల కొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి. సాంప్రదాయ ఇండియన్ టాయిలెట్లతో పోల్చి చూస్తే.. వెస్ట్రన్ టాయిలెట్లు అనారోగ్యంగా ఉన్నవారికి సౌకర్యంగా ఉంటాయి.
మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పులు ఉన్నవారికి ఈజీగా ఉంటాయి. అలాగే వృద్ధులు కూడా చాలా సౌకర్యవంతంగా వాడుకోవచ్చు. ఇవి వారికి కుర్చీలో కూర్చున్న పొజిషన్ ఉంటుంది కాబట్టి.. అనువుగా ఉంటాయి. అయితే.. ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ ఇలా టాయిలెట్ సీటు మీద కూర్చోవడం ద్వారా ఏమైనా ఇన్ఫెక్షన్లు వస్తాయా? అనే సందేహం చాలా మందిలో ఉంది.
దీనికి నిపుణులు ఏమంటున్నారంటే.. వెస్ట్రన్ టాయిలెట్ల ద్వారా ఇన్ఫెక్షన్లువస్తాయనేది కేవలం అపోహ అంటున్నారు. అవగాహన లేనివారు మాత్రమే ఈ తరహా కామెంట్ చేస్తారని అంటున్నారు. సరైన శుభ్రత పాటించకపోతేనే ఇన్ఫెక్షన్స్ వస్తాయని.. సాంప్రదాయ టాయిలెట్ల ద్వారా ఈ ఛాన్స్ ఉంటుందని అంటున్నారు. అందుకే.. ఏ తరహా టాయిలెట్ వినియోగించినా, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.