Leftover Paneer Water Uses :మనం పనీర్ వాటర్‌తో ఉపయోగం లేదని అనుకుంటాం. కానీ వాటితో బోలెడు ఉపయోగలున్నాయి.సాధారణంగా మనం ఇంట్లో చపాతీ పిండిని తడపడానికి నీటిని ఉపయోగిస్తాం. అయితే పనీర్ నీటిని కూడా ఇందుకోసం ఉపయోగించవచ్చు. తద్వారా పూరీ, చపాతీ వంటివి మెత్తగా రావడంతో పాటు రుచి కూడా బాగుంటుంది. బేకింగ్ వంటలు చేసుకునే క్రమంలో పిండిని తడుపుకోవడానికీ పనీర్ నీటిని వాడుకోవచ్చు.
కర్రీలలో గ్రేవీ కోసం నీళ్లు పోయడం మనకు అలవాటే! అయితే ఈసారి నీటికి బదులు పనీర్ నీటిని ట్రై చేయండి. అటు రుచీ పెరుగుతుంది, ఇటు అందులోని పోషకాలూ శరీరానికి లభిస్తాయి. కొన్ని కర్రీలు, ఇతర వంటకాలలో పులుపు ఎక్కువైతే కొద్దిగా ఈ నీటిని కలిపి చూడండి, ఫలితం ఉంటుంది. పండ్లు, కాయగూరలతో స్మూతీస్, జ్యూసులు వంటివి తయారుచేసుకునేటప్పుడు సాధారణ నీటికి బదులుగా పనీర్ నీటిని వాడితే రుచి మరింతగా పెరుగుతుంది. పైవాటిలో చక్కెర వేసుకోకపోయినా తియ్యదనం వస్తుంది.
Paneer Water Benefits :నూడుల్స్, పాస్తా, బియ్యం, బంగాళాదుంపలు ఇతర కాయగూరలు వంటివి ఉడికించే క్రమంలోనూ పనీర్ నీటిని ఉపయోగించుకోవచ్చు. అలాగే కొన్ని రకాల పప్పుల్ని కూడా ఈ నీళ్లలో నానబెట్టుకోవచ్చు. దీంతో ఈ నీటిలోని పోషకాలు ఆయా పదార్థాల్లో చేరి మనకు అందుతాయి. ఉప్మా వంటి టిఫిన్స్ తయారుచేసే క్రమంలో సాధారణ నీటితో పాటు కొంత పనీర్ నీటిని కూడా వాడితే దాని రుచి పెరుగుతుంది.