How to Take a Break From Social Media : "నేను సోషల్ మీడియాను శాశ్వతంగా వదిలేస్తున్నాను" అని ప్రకటించి వారం కూడా గడవకుండానే తిరిగి ప్రత్యక్షమయ్యేవాళ్లు ఎంతో మంది! వారిలో మీ మిత్రులు ఉండొచ్చు.. చివరకు అది మీరు కూడా కావొచ్చు! మరి.. ఎందుకిలా? బయటపడడానికి ప్రయత్నిస్తున్నా.. తిరిగి అందులోకే ఎలా జారిపోతున్నారు? ఈ పరిస్థితికి చెక్ పెట్టాలంటే ఏం చేయాలి?
సోషల్ మీడియా ద్వారా పలు ఉపయోగాలు ఉన్నాయి. వేగంగా కొత్త సమాచారం తెలుసుకోవచ్చు. అభిప్రాయాలు షేర్ చేసుకోవచ్చు. చర్చలు చేయవచ్చు. ఫేమ్ సంపాదించుకోవచ్చు. అయితే.. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. రెండోవైపు నష్టాలు కూడా ఉన్నాయి. అవతలి వ్యక్తి ఎవరన్నది కూడా తెలియకుండా ఫ్రెండ్షిప్ చేసి మోసపోతుంటారు. గంటలు గంటలు సమయం వృథాఅయిపోతూ ఉంటుంది. మానసిక సమస్యలు తలెత్తడం ఇందులో అతిపెద్దది. రకరకాల భావోద్వేగాలతో డిప్రెషన్ స్థాయికి వెళ్లేవారు కోకొల్లలు. కొందరు ఈ విషయాన్ని గుర్తించి.. అందులోనుంచి బయటపడేలా ప్రయత్నిస్తారు. కానీ.. సాధ్యం కాదు. కొన్ని రోజులు విరామం అంటూ ప్రకటిస్తారు. తిరిగి వెంటనే కనిపిస్తారు. మరికొందరు పూర్తిగా వదిలేస్తామని ఫిక్స్ అయిపోతారు.. కొన్ని రోజులకే ప్రత్యక్షమవుతారు. అంటే.. అంతగా అడిక్ట్ అయ్యారని అర్థం. ఇలాంటి పరిస్థితిలో మీరు కూడా ఉన్నారా? అయితే.. కొన్ని టిప్స్ పాటించాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.
టార్గెట్ ఫిక్స్ చేయండి :ఒకేసారి సోషల్ మీడియాను వదిలేయాలనే నిర్ణయం వద్దు. ముందుగా బ్రేక్స్ ఇవ్వండి. అది కూడా ఒక వారం రోజులు అని అనుకోవడం కాదు.. ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు అన్నది క్లియర్గా నిర్ణయించుకోండి. దీనివల్ల పలానా తేదీ వరకు ముట్టుకోవద్దు అనే క్లారిటీ ఉంటుంది.