How to Apply Learning Licence in Telangana : మీరు కొత్తగా ఏదైనా వాహనం కొన్నారా? లేదా కొనడానికి ప్లాన్ చేస్తున్నారా? అందుకోసం డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే, అంతకన్నా ముందు మీరు.. లెర్నర్స్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకప్పుడు లెర్నింగ్ లైసెన్స్ పొందాలంటే ఆర్టీవో ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చాలా సింపుల్‌గా ఇంట్లో కూర్చొనే ఆన్లైన్లో లెర్నింగ్ లైసెన్స్ కోసం అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఇంతకీ.. లెర్నింగ్ లైసెన్స్ పొందాలంటే కావాల్సిన అర్హతలేంటి? అవసరమైన పత్రాలు? ఎలా అప్లై చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
తెలంగాణలో డ్రైవింగ్ లైసెన్స్ అవసరమైనవారు.. ముందుగా లెర్నింగ్ లైసెన్స్‌కు అప్లై చేయాలి. అందుకోసం ఓ పరీక్ష కూడా రాయాలి. అందులో పాస్ అయితేనే వారికి లెర్నర్ లైసెన్స్ ఇస్తారు. ఈ లెర్నర్ లైసెన్స్ వచ్చాక.. 6 నెలల లోపు పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఏ వాహనం అయినా సరే డ్రైవింగ్ లైసెన్స్పొందే విధానం ఇలాగే ఉంటుంది.
అర్హతలు :
- లైట్ మోటర్ వెహికల్ (LMV) లెర్నింగ్ లైసెన్స్ కోసం కనీసం 18 సంవత్సరాలు ఉండాలి.
- ట్రాన్స్పోర్ట్ వెహికల్(TV) లెర్నింగ్ లైసెన్స్ కోసం 20 ఏళ్లు ఉండాలి.
- బేసిక్ ఇంగ్లీష్ లేదా తెలుగులో చదవడం, రాయడం రావాలి.
- వాహనం నడపడానికి శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలి.
అవసరమైన పత్రాలు :
- ఆధార్ కార్డ్
- పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు
- వయస్సు రుజువు కోసం (ఓటర్ ID, పాస్‌పోర్ట్, జనన ధృవీకరణ పత్రం మొదలైనవి)
- అడ్రస్ ప్రూఫ్ కోసం (ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ, రేషన్ కార్డ్ మొదలైనవి)
- అయితే, మీరు లెర్నింగ్ లైసెన్స్ కోసం అప్లై చేయడానికి ముందు RTA మార్గదర్శకాల ప్రకారం.. స్లాట్‌ను బుక్ చేసుకోవాలి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.