ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పకడ్బందీగా 2025 మార్చి నుంచి కొత్తవారికి ఇళ్ల స్థలాలు: మంత్రి కొలుసు - HousingMinister inspected NTRcolony - HOUSINGMINISTER INSPECTED NTRCOLONY

Housing Minister Kolusu Parthasarathy inspected NTR colony: 2025 మార్చి నుంచి కొత్తగా ఇళ్ల స్థలాలు పెట్టుకునే వారికి భవిష్యత్తులో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఎన్టీఆర్ కాలనీని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్​తో కలిసి ఆయన పరిశీలించారు. ఎన్టీఆర్ కాలనీకి ప్రధాన అర్హతదారులను త్వరలోనే నిర్వహిస్తామని అన్నారు.

housing_minister_inspected_ntr_colony
housing_minister_inspected_ntr_colony (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 22, 2024, 7:55 PM IST

Updated : Aug 22, 2024, 10:17 PM IST

Housing Minister Kolusu Parthasarathy inspected NTR colony: 2029 నాటికి అర్హత కలిగిన ఏ పేద వాడు ఇల్లు లేకుండా ఉండకూడదనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి పార్థసారథి అన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఇళ్ల స్థలాలను మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌తో కలిసి పరిశీలించారు. వచ్చే వంద రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా లక్షా 25 వేల ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేస్తామన్నారు.

ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో సాధ్యమైనంత త్వరగా ఇళ్ల నిర్మాణాలు చేసుకోవాలని లబ్ధిదారులకు మంత్రి సూచించారు. ఎన్టీఆర్ కాలనీలో గతంలో 1602 స్థలాలకు గాను, 1406 మంది లబ్ధిదారులకు స్థలం కేటాయించారని ప్రస్తుతం 320 మంది లబ్ధిదారులు ఇళ్లు కట్టుకొని నివసిస్తున్నారని మంత్రి చెప్పారు. బేస్మెంట్ వేసిన 873 ఇళ్లు ఆగిపోయాయని మంత్రి అన్నారు. మిగతా లబ్ధిదారులను పిలిచి ఇళ్లు నిర్మించుకోవాలని లేనిపక్షంలో ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ది కోల్పోతారని తెలిపారు.

MLA Vasantha Krishna Prasad:ఎన్టీఆర్ కాలనీకి ప్రధాన అర్హతదారులను త్వరలోనే నిర్ణయిస్తామని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. గతంలో ఇళ్ల స్థలాల విషయంలో అవకత ఒకలు జరిగాయి అన్న విషయంపై మంత్రి స్పందించారు. మరోసారి విచారణ జరిపి లబ్ధిదారులకు స్థలాలు కేటాయించాలని తెలిపారు. 2025 మార్చి నుంచి కొత్తగా ఇళ్ల స్థలాలు పెట్టుకునే వారికి అవకతవకలు జరగకుండా భవిష్యత్తులో పకడ్బందీగా ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ఇళ్లు నిర్మించుకునే వారికి ఆగిపోయిన హౌసింగ్ లోన్ వెంటనే విడుదల చేయాలని అధికారులకు సూచించారు. 1,80,000 రూపాయల హౌసింగ్ లోన్ కింద ఇళ్లు నిర్మించుకోలేని వారిని వారి ఇంటిని మరొకరికి బదిలీ చేయటం జరుగుతుందని తెలిపారు. ఎన్టీఆర్ కాలనీ మెయిన్ రోడ్ల విషయంలో మున్సిపల్ కమిషనర్​కు పలు రకాల సూచనలు ఇచ్చారు. ముందుగా మెయిన్ రోడ్డును సీసీ రోడ్డుగా నిర్మించాలన్నారు.

'అండగా ఉంటాం- మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం' - అచ్యుతాపురం ప్రమాద బాధితులకు చంద్రబాబు భరోసా - CBN Consoles Atchutapuram Victims

ఎన్టీఆర్ కాలనీలో గతంలో 1602 స్థలాలుంటే 1406 మంది లబ్ధిదారులకు కేటాయించారు. అందులో ఇక్కడ ప్రస్తుతం 320 మంది లబ్ధిదారులు ఇళ్లు కట్టుకొని నివసిస్తున్నారు. పునాదులు వేసిన 873 ఇళ్లు ఆగిపోయాయి. అక్కడ ఇళ్లు నిర్మించుకోవాలి లేదంటే ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ది కోల్పోతారు. ఎన్టీఆర్ కాలనీకి ప్రధాన అర్హతదారులను త్వరలోనే నిర్ణయిస్తాము. 2025 మార్చి నుంచి కొత్తగా ఇళ్ల స్థలాలు పెట్టుకునే వారికి అవకతవకలు జరగకుండా భవిష్యత్తులో పకడ్బందీగా ఏర్పాటు చేస్తున్నాము. ఇళ్లు నిర్మించుకునే వారికి ఆగిపోయిన హౌసింగ్ లోన్ వెంటనే విడుదల చేయాలని అధికారులకు సూచించడం జరిగింది.- కొలుసు పార్థసారథి, మంత్రి

అచ్యుతాపురం ప్రమాదం బాధాకరం - 3 నెలల్లో పరిశ్రమల భద్రతపై కార్యాచరణ: పవన్‌కల్యాణ్‌ - Pawan Kalyan reacts on Blast

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై క‌స‌ర‌త్తు - సమగ్ర విధానాన్ని అమలు చేయాలన్న సీఎం - CM Chandrababu Review on RTC

Last Updated : Aug 22, 2024, 10:17 PM IST

ABOUT THE AUTHOR

...view details