Bus Was Hit The Workers in Konaseema District: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పి.గన్నవరం మండలం ఊడిమూడి రహదారిపై 10 మంది కూలీలను ఆర్టీసీ బస్సు ఢీకొనింది. రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు జట్టు కూలీలు దుర్మరణం చెందగా మరొ ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మరో నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన వారిలో ముగ్గురు జి.పెద్దపూడి, మరొకరు ఆదిమూలవారిపాలెంకు చెందిన వారిగా తెలిసింది.
సీఐ జీపును ఢీకొట్టిన లారీ- తీవ్రంగా గాయపడ్డ పోలీసులు - CI Road Accident in Anantapur
Four People Dead in Bus Accident:రాజోలు నుంచి రాజమహేంద్రవరం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఊడిముడి వద్ద ట్రాక్టర్లోకి ధాన్యం లోడు చేస్తున్న జట్టు కూలీలను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నూకపెయ్యి శివ, వాసంశెట్టి సూర్యప్రకాశరావు, వీరి కట్లయ్య, చిలకలపూడి పండు అక్కడికక్కడే మృతి చెెందారు. చిలకలపూడి నాని, బోరుసు నాని ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు అమలాపురంలోని కొత్తపేట ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు సురక్షితంగా బయటపడ్డారు.