Swarnandhra Vision-2047 Theme:సాంకేతికతను అందిపుచ్చుకుని పారదర్శకమైన, మంచి పరిపాలనను అందించాలని స్వర్ణాంధ్ర విజన్-2047 ను ప్రభుత్వం రూపొందించింది. 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను విశ్లేషిస్తూ లక్ష్యాలు అందుకునేలా 4 మార్గాలను ప్రణాళికలో పొందుపరిచారు. యువశక్తిని అందుబాటులో ఉన్న సహజవనరులను సద్వినియోగం చేసుకుంటే స్వర్ణాంధ్ర కలలు సాధ్యమేనని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
అప్పటికి ఏపీ ఎలా మారనుంది? - స్వర్ణాంధ్ర- 2047 విజన్ డాక్యుమెంట్
సుపరిపాలన దిశగా అడుగులు:మంచి పరిపాలన సూచీలో ప్రస్తుతం రాష్ట్రం 10వ స్థానంలో ఉంది. 2029 నాటికి 6 వ స్థానం 2047 నాటికి మొదటి స్థానాన్ని సాధించాలనేది విజన్ 2047 లక్ష్యంగా నిర్దేశించారు. ఈ-పాలనలో రాష్ట్రం ప్రస్తుతం ఇప్పుడు 9వ ర్యాంకులో ఉంది. 2029 నాటికి ఐదో స్థానానికి, 2047 నాటికి మొదటి స్థానానికి చేరాలనేది లక్ష్యంగా పెట్టారు. పారా లీగల్ వాలంటీర్ల విషయంలో ప్రతి లక్ష మంది జనాభాకు రాష్ట్రంలో నలుగురు ఉండగా 2029 నాటికి ఏడుగురు లేదా అంతకన్నా ఎక్కువ, 2047 నాటికి 15 మంది కన్నా ఎక్కువ ఉండాలని నిర్దేశించారు. పోలీసు బలగాల్లో మహిళల భాగస్వామ్యం ప్రస్తుతం 5.4శాతంగా ఉండగా 2029 నాటికి 15శాతం 2047 నాటికి 33 శాతం దాటాలన్నారు. రాష్ట్రంలో పెండింగ్ కేసులు ప్రస్తుతం 65 శాతం ఉండగా 2029 నాటికి 40 శాతం కన్నా తక్కువకు, 2047 నాటికి 10 శాతం కన్నా తక్కువకు తీసుకురావాలని విజన్ ప్రణాళికలో పేర్కొన్నారు.
పవన్ కల్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ - పోలీసుల అదుపులో మల్లికార్జునరావు
సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా:రానున్న ఐదేళ్లలో ఏడాదికి 15 శాతానికి మించి వృద్ధి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు వ్యవసాయరంగంలో ఏడాదికి 11.05శాతం, పరిశ్రమల రంగంలో 16.15శాతం, సేవా రంగంలో 17.95శాతం వృద్ధి సాధిస్తేనే మొత్తం వృద్ధి ఈ స్థాయిలో ఉంటుంది. ఇందుకు వచ్చే 5 ఏళ్లలో వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో 40.43 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాలి. విజన్ డాక్యుమెంట్ లో వ్యవసాయంలో సాంకేతికతకు పెద్దపీట వేశారు. ఉత్పాదకత పెంచేందుకు.. కోత అనంతర నష్టాలు తగ్గించేందుకు ఏఐ, ఐఓటీ, రొబోటిక్స్, డ్రోన్స్, ఉపగ్రహ సాంకేతికత వినియోగం పెరగాలని విజన్ డాక్యుమెంట్ సూచించింది. చిన్న రైతులకు డిజిటల్ సేవలు, మైక్రో క్రెడిట్ సౌకర్యాలు, పంటల బీమా, రియల్‌టైమ్ రాయితీలు అందించనున్నారు. డిజిటల్ అక్షరాస్యతపై శిక్షణ ఇవ్వనున్నారు. 2047 నాటికి 40శాతం భూముల్ని ప్రకృతి సేద్య విధానంలోకి మార్చాలని స్వర్ణాంధ్ర డాక్యుమెంట్ నిర్దేశించింది.
"పవన్ కల్యాణ్‌ను చంపేస్తాం" - డిప్యూటీ సీఎం పేషీకి బెదిరింపు కాల్
విద్యా పరిశోధన విశ్వవిద్యాలయాల ఏర్పాటు: నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పన ఆధారిత విద్య ద్వారా ప్రపంచ స్థాయి ప్రమాణాలు సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. AI విశ్వవిద్యాలయం, AIజాతీయ కేంద్రం, మూడు నుంచి ఐదు ప్రపంచ స్థాయి బహుళ విభాగాల విద్య, పరిశోధన విశ్వవిద్యాలయాల ఏర్పాటుతో అమరావతి, విశాఖపట్నం, తిరుపతిలను నాలెడ్జ్ సిటీలుగా అభివృద్ధి చేయనుంది. పాఠశాల, ఉన్నత విద్యను నైపుణ్య కోర్సులతో అనుసంధానం చేయనుంది. ఇందులో భాగంగా 6 నుంచి 8తరగతుల్లో వృత్తి విద్య కోర్సులను ప్రవేశపెడతారు. ఇవి ఉన్నత విద్య వరకు కొనసాగుతాయి ఏడు యాంకర్ హబ్‌లు, మరో 40 టూరిస్ట్ సర్క్యూట్ల ఏర్పాటు ద్వారా పర్యాటకాన్ని కొత్త పుంతలు తొక్కించనుంది. దేశీయ, విదేశీ పర్యాటకులు రాష్ట్రాన్ని పెద్దఎత్తున సందర్శించేలా ప్రణాళికలు రూపొందించింది. తిరుపతిని ఆసియాలో అతిపెద్ద ఆధ్యాత్మిక హబ్‌గా తీర్చిదిద్దనున్నారు. అమరావతి, నాగార్జునకొండ, బౌద్దగయతో కలిపి బుద్దిస్ట్ సర్క్యూట్‌ని అభివృద్ధి చేయనున్నారు.
భవిష్యత్ మహానగరంగా అమరావతి: అమరావతి రాజధాని ప్రాంతంలో సాంకేతికత, విద్య, ఆర్థిక, క్రీడ, ఆరోగ్య, ఎలక్ట్రానిక్స్, న్యాయ సేవలు, పాలన, పర్యాటకం సమగ్రస్థాయిలో వృద్ధి చెందేలా చేస్తారు. అమరావతిని భవిష్యత్ మహానగరంగా తీర్చిదిద్దడంలో భాగంగానౌకాశ్రయాలు, రహదారులు, విమానాశ్రయాలు, అంతర్గత జలమార్గాలను ఇంటిగ్రేటెడ్ నెట్‌వర్క్‌తో అనుసంధానించి, రాష్ట్రాన్ని అంతర్జాతీయ ఆర్థిక కేంద్రంగా మార్చనున్నారు. ఉత్తరాంధ్రలో విశాఖను ఆర్థిక దిక్సూచిగా నిలపనున్నారు. కర్నూలులో విత్తన కేంద్రం, రక్షణ- పౌరవిమానయానం, సౌర, పవన విద్యుత్కేంద్రాల వృద్ధి చేయనున్నారు. తిరుపతిలో ఫుడ్ ప్రాసెసింగ్, విద్య, మొబైల్-ఎలక్ట్రానిక్స్, టెక్నాలజీ, పర్యాటకం, రియల్ ఎస్టేట్ కేంద్రంగా తీర్చిదిద్దనున్నారు. గోదావరి ప్రాంతంలో కాకినాడను ఆర్థిక దిక్సూచిగా మలచుకుని.. ఈ ప్రాంతంలో ఆక్వా, ఆయిల్ అండ్ గ్యాస్, షిప్పింగ్ అండ్ మాన్యుఫాక్చరింగ్ హబ్ గా అభివృద్ధి చేస్తారు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికీ 2047 నాటికి సుస్థిర, సౌభాగ్యంతో కూడిన భవిష్యత్తును కల్పించాలని రాష్ట్రప్రభుత్వం సంకల్పించింది.
స్టెల్లా ఎల్ పనామా నౌకలో 38 వేల టన్నుల బియ్యం - కొనసాగుతున్న తనిఖీలు