Honor Attack In Eluru Ditrict : ప్రేమ వివాహమా అమ్మో అది కచ్చితంగా చివరకు రక్తపాతంగానే మిగుతుంది అనేలా సమాజ దృష్టి కోణాన్ని మార్చాయి పరువు హత్యలు. కులం (Caste) , మతం (Religion), ధనిక ( Rich),పేద (Poor) ఇవన్ని ప్రేమకు, ప్రేమికులకు అతీతం కాదు. ఇది ఒకప్పటి మాట లేకపోతే సినిమాల బాట. అంతేకానీ నేడు ప్రేమంటే ఒక అరాచక శక్తిగా చూస్తున్నారు కొందరు. చదువు, జ్ఞానం ఉన్నవాళ్లుకు కూడా బిడ్డల ప్రేమ కన్నా ముందు కొన్ని సామాజిక వ్యత్యాసాలే కనబడుతున్నాయి.
మరో పరువు హత్య.. 'నాన్నా.. నన్ను చంపొద్దు ప్లీజ్'.. ఆడియో వైరల్
YSRCP leader Honor Attack on Young Man : నాణేనికి ఒక వైపు ప్రేమ వివాహాలు విజయగాథలు, స్పూర్తి కథలైతే. మరో వైపు తెగిన బంధాలు, రక్తమొడుతూ ఒంటరి తనాల బతుకులే ఎక్కువ అని నిరూపించడానికి ఎన్నో కథలు ఉన్నాయి. కన్న బిడ్డల బతుకును ఎంతో ఉన్నతంగా ఊహించుకునే తల్లిదండ్రులు వారికై వారు జీవిత భాగస్వామిని వెతుక్కుంటే సహించలేరు. చిన్న వయసు తెలిసీ తెలియని తనమని కొట్టిపారేస్తారు. ఇది మంచిదే వారి అనుభవంలో చూసిన వాటి వల్ల అలా వద్దనడం మంచిదే. అయితే మేజర్ అయిన బిడ్డ మంచి విలువలు, సంపాదన ఉన్న వ్యక్తిని ప్రేమించి వివాహం (marriage) చేసుకుంటా అన్నా కొందరు తల్లిదండ్రులకు నచ్చడంలేదు. కారణం కులం, మతం. ఇలాంటివే హత్యలకు దారితీసి యువ ప్రాణాల్ని బలి తీసుకుంటున్నాయి.
కూతురి లవర్ను పొడిచి చంపిన తండ్రి.. తమ కులం కాదని...
పేదింటి అబ్బాయిని ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో యువకుడిపై యువతి తల్లిదండ్రులు దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం సీతారామపురానికి చెందిన వంశీ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ సర్పంచ్ కుమార్తె శ్రావణిని ప్రేమ వివాహం చేసుకున్నారు. కులాంతర వివాహం అందునా అబ్బాయికి పెద్దగా ఆస్తి లేదని జీర్ణించుకోలేని యువతి తల్లిదండ్రులు, బందువులు వంశీ కుటుంబ సభ్యలపై కత్తితో దాడి చేశారు. దాడిలో బాధితుడికి తీవ్ర గాయాలు కాగా తల్లిదండ్రులకు స్వల్పగాయాలు అయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువతి పెద్దనాన్న ఈరి ప్రెసిడెంట్ వైఎస్సార్సీపీ నేత సత్య మురళీమోహన్ వంశీపై దాడి చెయ్యగా అతడు తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డాడు.
'ఎనిమిదో తారీకున ఏలూరులో పెళ్లి చేసుకున్నాం. అమ్మాయి తల్లిదండ్రుల నుంచి హాని ఉంటుందని పోలీసులను సంప్రదించాము. పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. తరువాత రోజు సుమారు ఇరవై మంది బంధవులతో అమ్మాయి తరుపు వారు మా కుటుంబంపై దాడి చేశారు. నన్ను కత్తితో పొడవడానికి వస్తే తప్పించుకున్నాను. దాడిలో నా చెయ్యికి గాయమైంది. నా భార్యను వాళ్లు బలవంతంగా తీసుకుపోయారు.' -వంశీ, బాధితుడు
యువకుడి మృతి.. ప్రియురాలి బంధువులే కారణమంటూ ఆందోళన..
ప్రేమ వివాహం చేసుకున్నాడనే అక్కసుతో యువకుడిపై యువతి తల్లిదండ్రులు దాడి