Home Guard Threatened a Loving Couple and Raped a Woman :విజయనగరం జిల్లాలో ఒంటరిగా ఉన్న ప్రేమ జంటను హోం గార్డు బెదిరించి అత్యాచారానికి పాల్పడిన ఘటనపై పోలీసుల దర్యాప్తు చేపట్టారు. తనను బెదిరించి హోంగార్డు సురేశ్ అత్యాచారం చేసినట్లు బాధితురాలు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో విజయనగరం డీఎస్పీ గోవిందరావు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
అసలేం జరిగిందంటే..
విజయనగరం జిల్లాలో ఒంటరిగా ఉన్న ఓ ప్రేమ జంటను బెదిరించి ప్రేమికురాలుపై హోం గార్డు సురేశ్ మంగళవారం అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతి తన ప్రియుడితో కలిసి ఉన్న సమయంలో హోం గార్డు సురేశ్‌కు తారసపడింది. దీంతో యువతిపై కన్నేసిన హోం గార్డు ఒంటరిగా ఉన్న ప్రేమ జంటను ఇక్కడ ఏం చేస్తున్నారని బెదిరించాడు. తాను ఎస్సై అని, పోలీస్ స్టేషన్‌కు రావాలని బయపెట్టాడు. దీంతో యువతి ప్రియుడు పారిపోయాడు. యువతిని సొంతూరికి పంపించేందుకు బస్సు ఎక్కిస్తానని నమ్మించి తన బైక్‌పై తీసుకెళ్లాడు.
రామతీర్థం సమీపంలోని చంపావతి నది ఒడ్డునున్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. తిరిగి ఆమెను రామతీర్థం కూడలి వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. అనంతరం ఇంటికి చేరుకున్న యువతి కుటుంబ సభ్యులతో పాటు తన స్నేహితుని ద్వారా బుధవారం సాయంత్రం పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మంగళవారం జరిగిన ఈ ఘటన బాధితురాలి ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగు చూసింది. దీనిపై విజయనగరం డీఎస్పీ గోవిందరావు విచారణ చేపట్టారు. సంఘటనపై కేసు నమోదు చేసుకుని పూర్వపరాలపై విచారిస్తున్నట్లు వెల్లడించారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు నెల్లిమర్ల పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు సురేశ్‌ను అరెస్టు చేసినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ చెప్పారు. అతన్ని విధుల నుంచి శాశ్వతంగా తొలగించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
పోర్న్ వీడియోస్ చూసి సొంత చెల్లిపై రేప్- ఆపై గొంతు నులిమి హత్య- తల్లి కళ్ల ముందే జరిగినా!
న్యాయ విద్యార్థుల దారుణం - యువతిపై అత్యాచారం చేసిన భర్త - వీడియో తీసిన భార్య - law student raped in Tirupati