Holi Celebrations in Telangana 2024 : ఏటా పాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున వచ్చే పర్వదినం హోలీ. దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకునే ఉత్సవం ఇది. హిరణ్యకశిపుడు తన సోదరి హోలిక అడ్డుపెట్టుకుని ప్రహ్లాదుడిని చంపాలని పన్నాగం పన్నుతాడు. ఐతే హోలికనే మంటల్లోనే దహనమైపోతుంది. హోలిక దహనమైన రోజును హోలీగా జరుపుకుంటారనే కథ ప్రచారంలో ఉంది. అలాగే శివుడు మన్మథుడిని చంపినందుకు గుర్తుగా కామ దహనం చేస్తూ రంగులతో ఉత్సవం చేసుకుంటారని మరో కథ కూడా ఉంది.
హోలీ వచ్చిందంటే చిన్నాపెద్దా అంతా రంగులు జల్లుకుంటూ కేరింతలు కొడతారు. అప్పట్లో సహజ సిద్ధంగా దొరికే పదార్థాల నుంచే రంగులు తయారు చేసేవారు. కాలక్రమేణ మార్పులు చోటుచేసుకొని వాటర్ గన్స్, ఇతర వస్తువులు మార్కెట్‌లోకి వచ్చాయి. హోలీ కోసం యువత పెద్దఎత్తున రంగులు కొనుగోలు చేస్తారు. ఆటపాటల్లో మునిగి తేలుతూ ఉత్సాహంగా హోలీ జరుపుకుంటారు. హైదరాబాద్‌లో పలు రిసార్ట్‌లు హోలీ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. సామూహికంగా రంగులు చల్లుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాయి.
ఆ కలర్స్‌తో డేంజర్- హోలీ ఆడే ముందు, తర్వాత ఇలా చేయడం మస్ట్! - Pre And Post Holi Care Tips
హోలీ వేళ అధిక రసాయనాలతో కూడిన రంగులను చల్లుకోవడం వల్ల చర్మం దెబ్బతినే అవకాశం ఉంది. తగిన జాగ్రత్తలతో హోలీ జరుపుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కళ్లలో రంగు పడకుండా చూస్కోవాలని స్పష్టంచేస్తున్నారు. రంగులు చల్లుకునేప్పుడు కళ్లద్దాలు ధరించాలి. తగిన జాగ్రత్తలు తీసుకుని హోలీ జరుపుకుంటే జీవితం రంగుల రంగేళీ అవుతుంది.