తెలంగాణ

telangana

ETV Bharat / state

శివబాలకృష్ణపై కొనసాగిన ఏసీబీ విచారణ - సోదరుడు శివ నవీన్ కుమార్‌ అరెస్ట్​ - Shiva Balakrishna Custody Extension

HMDA Shiva Balakrishna Case Update : హెచ్​ఎండీఏ మాజీ డైరెక్టర్​ శివబాలకృష్ణను ఏడో రోజు ఏసీబీ అధికారులు విచారించారు. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కస్టడీలో ఇచ్చిన సమాచారం మేరకు శివబాలకృష్ణ సోదరుడు శివ నవీన్‌ కుమార్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. నల్గొండ, మహబూబ్‌నగర్‌, జనగామ జిల్లాల్లో ఉన్న ఆస్తుల వివరాలు తెలుసుకున్నామని అధికారులు వెల్లడించారు. మరో ఐదు రోజులు కస్టడీని పొడిగించేందుకు కోర్టు అనుమతులు కోరనున్నట్లు సమాచారం.

ACB Investigated Siva Bala Krishna
Siva Bala Krishna Case Update

By ETV Bharat Telangana Team

Published : Feb 6, 2024, 12:43 PM IST

Updated : Feb 6, 2024, 10:42 PM IST

HMDA Shiva Balakrishna Case Update : ఆదాయానికి మించిన అక్రమ ఆస్తుల కేసులో రెరా మాజీ కార్యదర్శి శివబాలకృష్ణ ఏసీబీ కస్టడీలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత ఆరు రోజులుగా అతణ్ని అధికారులు విచారిస్తున్నారు. తాజా దర్యాప్తులో శివబాలకృష్ణకు భారీగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఆయన సోదరుడు నవీన్​, మేనల్లుడు భరత్​ పేరు మీద ఆస్తులు ఉన్నాయని విచారణలో వెలుగులోకి వచ్చినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. 150 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు 15 ఓపెన్​ ప్లాట్లను కూడా గుర్తించినట్లు వెల్లడించారు. ఇవే కాకుండా నల్గొండ, మహబూబ్‌నగర్‌, జనగామ జిల్లాల్లో శివబాలకృష్ణకు ఆస్తులున్నాయని తెలుసుకున్నట్లు వివరించారు.

HMDA Shiva Balakrishna Custody Extension :మరోవైపు హెచ్​ఎండీఏ మాజీ డైరెక్టర్​ శివబాలకృష్ణ(Siva Balakrishna) ఏసీబీ కస్టడీ బుధవారంతో ముగియునుంది. మరో ఐదు రోజులు కస్టడీని పొడిగించాలని ఏసీబీ అధికారులు నాంపల్లి కోర్టును కోరునున్నట్లు సమాచారం. గతంలో నిందితుడ్ని పది రోజులు ఏసీబీఅధికారులు కస్టడీకి అడగగా కోర్టు 8 రోజులకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. గత ఆరు రోజులుగా జరిగిన విచారణలో ఆయన ఆస్తుల మీద ఆరా తీశామని అధికారులు తెలిపారు. ఆదివారం రోజున హెచ్ఎండీఏ, రెరా ఉద్యోగులను పిలిచి విచారణ చేసినట్లు తెలుస్తోంది. నిందితుడుతో కలిసి పనిచేసిన ఉద్యోగులకు నోటీసులిచ్చి విచారించామని అధికారులు పేర్కొన్నారు.

ఏసీబీ కస్టడీకి శివబాలకృష్ణ - 15 బ్యాంకు ఖాతాల లవాదేవీలపై అధికారుల ఆరా

Shiva Balakrishna Case Details : రెరాలో కీలక స్థానాల్లో పని చేస్తున్న ఉద్యోగులను శివ బాలకృష్ణ ముందే విచారణ జరిపామని ఏసీబీ అధికారులు తెలిపారు. శివబాలకృష్ణ అనుమతులిచ్చిన రియల్ ఎస్టేట్ వెంచర్ల(Real Estate Ventures)పై ఆరా తీశామని వెల్లడించారు. వీటితో పాటు కోర్టు వివాదాల్లో ఉన్న భూములకు కూడా నిందితుడు అనుమతులు ఇచ్చినట్లు తెలుసుకున్నామని అధికారులు చెప్పారు. మాన్యువల్ అనుమతులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందన్న దానిపై విచారించామని వెల్లడించారు.

అసలు ఏమి జరిగిందంటే : గత నెల 24వ తేదీన శివబాలకృష్ణ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆ రోజే రూ.100 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. అందులో రూ.40 లక్షల నగదు, రెండు కిలోల బంగారు ఆభరణాలు, ఆస్తిపత్రాలు, బ్యాంకు డిపాజిట్లు, ఖరీదైన 60 చేతి గడియారాలు తదితర వస్తువులను అధికారులు గుర్తించారు. దీంతో ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్​ విధించింది. అనంతరం అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇప్పటికి ఏడు రోజులు ముగిసింది.

చంచల్‌గూడ జైలుకు శివబాలకృష్ణ - బినామీలను విచారించడంపై ఏసీబీ ఫోకస్

శిలబాలకృష్ణ బినామీలపై ఫోకస్‌- అయిదో రోజు ముగిసిన ఏసీబీ దర్యాప్తు

Last Updated : Feb 6, 2024, 10:42 PM IST

ABOUT THE AUTHOR

...view details