HMDA Ex Director Shiva Balakrishna Case Updates :ప్రభుత్వ ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయల అక్రమ సంపాదన కూడబెట్టి, ఏసీబీకి చిక్కినహెచ్ఎండీఏమాజీ డైరెక్టర్, మెట్రో రైల్ ప్రణాళిక అధికారి శివ బాలకృష్ణ కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హెచ్ఎండీఏ డైరెక్టర్‌గా పని చేసిన సమయంలో నలుగురు అధికారులు ఇప్పుడు అందుబాటులో లేనట్లు సమాచారం. వారిలో ఇద్దరు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్‌లో పని చేస్తున్న అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్ శివబాలకృష్ణకు బినామీలుగా ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించినట్లు తెలిసింది. శివబాలకృష్ణ నివాసంలో తనిఖీలు ప్రారంభం కాగానే, ఆ నలుగురు ఉద్యోగులు తమ నివాసాల్లోని కీలకమైన దస్త్రాలతో మాయమైనట్టు ఉద్యోగవర్గాల్లో చర్చ సాగుతోంది.
బాలకృష్ణ అవినీతిపై సర్కార్ నజర్ - బినామీ ఆస్తులపై ఏసీబీ విచారణ
ACB Arrested Shiva Balakrishna :మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్‌లో భూ బదలాయింపుల విభాగం చాలా కీలకం. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న సెక్షన్ ఆఫీసర్‌కు గతంలో ఉన్నతాధికారి అండదండలు పుష్కలంగా ఉండేవి. అవినీతి ఆరోపణలు వచ్చినా, ఆరేళ్లుగా అక్కడే కొనసాగటమే అందుకు నిదర్శనం. హెచ్ఎండీఏనుంచి ఎంఏయూడీకి వచ్చే భూ బదలాయింపుల దస్త్రాలన్నీ ఆ సెక్షన్ నుంచే వెళ్తుంటాయి. ఇంతటి కీలకమైన దస్త్రాలకు, ఆ అధికారి సంతకం చాలా కీలకం. రెండేళ్లుగా హెచ్ఎండీఏ నుంచి వచ్చే భూ బదలాయింపు పత్రాలు తొలుత రెరా ఇన్‌ఛార్జీ శివబాలకృష్ణకు నేరుగా వెళ్లాయనే ఆరోపణలున్నాయి. సదరు సెక్షన్ ఆఫీసర్ నుంచి వచ్చే దస్త్రాలే పరిష్కారానికి నోచుకునేవని బాధితులు వాపోతున్నారు.
అవినీతి శాఖల జాబితాలో ఎక్సైజ్ కూడా చేరింది - ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ ఆసక్తికర ట్వీట్