High Court on Rushikonda Illegal Buildings in Visakhapatnam :వైఎస్సార్సీపీ హయాంలో సహజ వనరులను యథేచ్ఛగా దోచుకున్న నేతలు కోట్లు మూటకట్టుకున్నారన్నది జగమెరిగిన సత్యం. అవినీతి, అక్రమాలతో ఐదేళ్లు రాష్ట్రాన్ని అదోగతి పాలు చేసిన నేతల అధికార దుర్వినియోగాలపై కేసులు అనేకం. ఇన్నేళ్లు అధికారం అండతో దర్జాగా ఉన్న వారికి బుద్ది చెప్పడానికి కూటమి ప్రుభుత్వం సిద్దంగా ఉంది. విశాఖ రుషికొండ దోపిడీపై హైకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే.
విశాఖ జిల్లా రుషికొండపై పర్యావరణ అనుమతులు లేకుండా భవనాలు నిర్మించి అప్పటి సీఎం జగన్, అప్పటి సీఎస్ జవహర్‌రెడ్డి, మరికొందరు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, వారిపై కేసు నమోదు చేసేలా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పురోగతి లేదని పేర్కొంటూ సమాచార హక్కు సంఘం జాతీయ అధ్యక్షుడు టి. గంగాధర్ దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్ ఇచ్చిన ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేస్తూ పూర్తి వివరాలు కోర్టు ముందుంచాలని పోలీసులను ఆదేశించింది. అనంతరం విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
'21వ శతాబ్దపు నయా చక్రవర్తి'- రుషికొండ రాజమహల్లో కళ్లుచెదిరే నిర్మాణాలు - jagan bathroom