ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 1, 2024, 3:53 PM IST

Updated : Feb 1, 2024, 4:42 PM IST

ETV Bharat / state

సీతానగరం శిరోముండనం కేసు - నిందితుల క్వాష్‌ పిటిషన్‌ కొట్టేసిన హైకోర్టు

Siromundanam case: తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పీఎస్‌ పరిధిలోని శిరోముండనం కేసులో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. నిందితులు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ మేరకు ఉన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. గతంలో విచారణపై ఇచ్చిన స్టేను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది.

Siromundanam case
Siromundanam case

Siromundanam Case: తూర్పు గోదావరి జిల్లాలో ఇసుక అక్రమ రవాణా అడ్డుకున్నాడనే నెపంతో పోలీస్ స్టేషన్​లోనే దళిత యువకుడికి శిరోముండనం చేసిన కేసులో హైకోర్టు తీర్పు వెలువరించింది. తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ నిందితులు క్వాష్ పిటిషన్ దాఖలు చేసారు. నిందితులపై కట్టిన కేసులో తదుపరి విచారణ జరపకుండా 2020 లో హైకోర్టు స్టే విదించిన కోర్టు నేడు స్టేను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది.

క్వాష్ పిటిషన్ కొట్టేస్తూ హైకోర్టు తీర్పు:తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పీఎస్‌ పరిధిలోని శిరోముండనం కేసులో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. నిందితులు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను కొట్టివేసింది. శిరోముండనం బాధితుడు వరప్రసాద్ తరఫున న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ హైకోర్టులో వాదనలు వినిపించారు. ఇసుక అక్రమ రవాణా అడ్డుకున్నారనే నెపంతో వరప్రసాద్​ను కులం పేరుతో దూషించి, నేతల అండదండలతో పోలీస్ స్టేషన్​లోనే శిరోముండనం చేయించిన నిందితులకు చట్టం ప్రకారం శిక్ష విధించాలని న్యాయవాది శ్రవణ్ కుమార్ కోరారు. విచారణ పూర్తి కాకుండా నిందితులు వేసిన క్వాష్ పిటిషన్​పై న్యాయస్థానాలు తీర్పులు ఇవ్వలేవని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు మార్గ నిర్దేశాలను అనుసరించి క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేయాలని శ్రావణ్ కుమార్ కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు నిందితుల క్వాష్ పిటిషన్ కొట్టేస్తూ తీర్పు వెల్లడించింది.

'నక్సలైటుగా మారేందుకు అవకాశం ఇవ్వండి'.. రాష్ట్రపతికి ఎస్సీ యువకుడి లేఖ

ఇదీ జరిగింది: తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో వైఎస్సార్సీపీ నేతలు చేస్తున్న ఇసుక అక్రమాలను వరప్రసాద్‌ అనే దళిత యువకుడు అడ్డుకున్నాడు. ఇసుక లారీలు అడ్డుకున్నందుకు మునికూడలి వద్ద స్థానిక వైఎస్సార్సీపీ నాయకుడు కవల కృష్ణమూర్తి కారుతో వచ్చి ఢీకొట్టాడు. అనంతరం వైఎస్సార్సీపీ నేత అనుచరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీస్‌స్టేషన్‌లో వరప్రసాద్‌ విచక్షణారహితంగా కొట్టి జుట్టు, మీసాలు తీసేశారు. ఈ అంశంపై అప్పట్లో ఆందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తనకు నక్సలైటుగా మారిపోయేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ శిరోముండనం బాధిత దళిత యువకుడు ప్రసాద్ రాష్ట్రపతికి లేఖ రాశాడు. ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు పోలీస్ స్టేషన్​లో తనకు శిరోముండనం చేశారని లేఖలో ఆవేదన వ్యక్తం చేశాడు.

దాష్టీకం: పోలీస్ స్టేషన్​లో యువకుడికి శిరోముండనం

స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం: వరప్రసాద్ లేఖ నేపథ్యంలో శిరోముండనం కేసును రాష్ట్రపతి కార్యాలయం తీవ్రంగా పరిగణించింది. ఏపీ సాధారణ పరిపాలన విభాగానికి సంబంధిత దస్త్రం బదిలీ చేసింది. అసిస్టెంట్‌ సెక్రటరీ జనార్దన్‌బాబును కలవాలని బాధితుడు ప్రసాద్‌కు ఆదేశం పంపింది. ఈ కేసు విషయంలో జనార్దన్‌బాబుకు సహకరించాలని ప్రసాద్‌కు సూచించింది. ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర దుమారాన్ని రేపడంతో స్పందించిన అప్పటి డీజీపీ పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్సై, కానిస్టేబుళ్ల సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. పోలీసులతో పాటుగా, వైఎఎస్సార్పీ నేతలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

సీతానగరం ఘటనపై భగ్గుమన్న ఏపీ ప్రతిపక్షాలు

Last Updated : Feb 1, 2024, 4:42 PM IST

ABOUT THE AUTHOR

...view details