Hero Upendra celebrates UI movie success meet in Vijayawada: కన్నడ విలక్షణ కథానాయకుడు ఉపేంద్ర విజయవాడలో సందడి చేశారు. తాజా సినిమా యూఐ(UI) సినిమా విజయోత్సవం సందర్భంగా నోవోటెల్ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉపేంద్ర మాట్లాడారు. చిత్రం మంచి ఆదరణ పొందిందని, మంచి కలెక్షన్లు వస్తున్నాయని తెలిపారు. సినిమా విజయం సాధించడంతో ప్రేక్షకులకు కృతజ్ఞత చెప్పారు. ప్రేక్షకుల అభిరుచి మేరకు సినిమా తీశామని అందురూ థియేటర్‌కు వెళ్లి చూడాలని విజ్ఞప్తి చేశారు.
ఈ యూఐ సినిమాకు ఆడియన్సే స్టార్స్ అని ఉపేంద్ర తెలిపారు. గ్యాప్ వస్తే తెలుగులో స్ట్రైట్ సినిమా చేస్తానని ఉపేంద్ర చెప్పారు. తన సినిమాకు వెరైటీ టైటిళ్లు పెట్టడానికి వేరే కారణం లేదని, ప్రేక్షకులకు వేగంగా కనెక్ట్ కావడమే లక్ష్యమని అన్నారు. ఎంత బాగా సినిమా తీసినా హిట్, ప్లాప్ అనేది ప్రేక్షకుల చేతిలోనే ఉంటుందని అన్నారు. అందుకే ప్రేక్షకులకు మెచ్చే విధంగా సినిమాలు తీయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఉపేంద్ర చెప్పారు.