Big Tanker In Anakapalli District: అనకాపల్లి జిల్లా నక్కపల్లి పరిధిలోని జాతీయ రహదారిపై భారీ ట్యాంకర్ కనిపించింది. ఈ భారీ ట్యాంకర్‌ను కాకినాడ పోర్టు నుంచి ఒడిశాలోని బరంపురానికి తీసుకెళ్తున్నారు. సుమారు 100 అడుగుల పొడవు, 30 అడుగుల ఎత్తు ఉన్న ఈ ట్యాంకర్ ప్రత్యేకంగా 20 మంది సిబ్బంది పర్యవేక్షణలో వెళ్తుంది. జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు, హైవే నిర్వాహకులు పర్యవేక్షిస్తున్నారు. రోజుకు గరిష్ఠంగా 20 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణం సాగుతోంది. జాతీయ రహదారిపై వెళ్లే ప్రయాణికులు ఈ ట్యాంకర్‌ను ఎంతో ఆసక్తిగా తిలకించారు.
100 అడుగుల పొడవు-30 అడుగుల ఎత్తు - నక్కపల్లి హైవేపై భారీ ట్యాంకర్ - BIG TANKER IN NAKKAPALLY HIGHWAY
జాతీయ రహదారిపై భారీ ట్యాంకర్ - కాకినాడ పోర్టు నుంచి ఒడిశాలోని బరంపురానికి తరలింపు
BIG TANKER IN NAKKAPALLY HIGHWAY (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 1, 2025, 5:25 PM IST