- భారీవర్షాల వల్ల పలు మార్గాల్లో రైళ్లు రద్దు చేసిన దక్షిణమధ్య రైల్వే
- విజయవాడ డివిజన్‌లో పలు మార్గాల్లో తిరిగే 41 రైళ్లు రద్దు
- ఇవాళ, రేపు, ఎల్లుండి తిరిగే రైళ్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన రైల్వే
- ప్రయాణికుల సౌకర్యార్థం ప్రధాన రైల్వే స్టేషన్లలో హెల్ప్ లైన్లు ఏర్పాటు
Live Updates: ఏపీలో భారీ వర్షాలు - విజయవాడ డివిజన్‌లో 41 రైళ్లు రద్దు - HEAVY RAINS IN ANDHRA PRADESH
Heavy Rains in AP (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 31, 2024, 12:00 PM IST
|Updated : Aug 31, 2024, 10:35 PM IST
HEAVY RAINS IN ANDHRA PRADESH: వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు.
LIVE FEED
- ఎన్టీఆర్ జిల్లా: కంచికచర్ల మం. పరిటాల న్యూకాన్ బ్రిక్స్ కంపెనీలోకి నీరు
- కంపెనీలోకి వరదనీరు చేరడంతో మొదటి అంతస్తుకు చేరుకున్న ఉద్యోగులు
- ఉద్యోగులను కాపాడేందుకు చర్యలు చేపట్టిన కంపెనీ అధికారులు
- నంద్యాల: మహానంది వద్ద పాలేరు వాగు ఉద్ధృత ప్రవాహం
- మహానంది నుంచి బోయిలకుంట మెట్ట రోడ్డుపై నిలిచిన రాకపోకలు
- వాగు వద్ద ప్రమాద సూచికలు ఏర్పాటు చేసిన మహానంది పోలీసులు
- విజయవాడ: కొండచరియల తొలగింపును నిలిపివేసిన అధికారులు
- చీకటిలో ఆటంకాలు కలగడంతో సహాయ చర్యలు నిలిపివేత
- శిథిలాల కింద మరో వ్యక్తి చిక్కుకున్నారని భావిస్తున్న పోలీసులు
- భారీవర్షాల కారణంగా రాష్ట్రంలో పలు మార్గాల్లో రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
- విజయవాడ డివిజన్ లో పలు మార్గాల్లో తిరిగే 25 రైళ్లు రద్దు
- ఇవాళ, రేపు తిరిగే రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపిన రైల్వేశాఖ
- ప్రయాణికుల సౌకర్యార్థం ప్రధాన రైల్వే స్టేషన్లలో హెల్ప్ లైన్లు ఏర్పాటు చేసిన రైల్వేశాఖ
భారీగా నిలిచిపోయిన వాహనాలు
- సూర్యాపేట: కోదాడ వద్ద భారీగా నిలిచిపోయిన వాహనాలు
- నందిగామ వద్ద వాగు పొంగడంతో హైవేపైకి చేరిన వరదనీరు
- హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలు ఖమ్మం వైపు మళ్లింపు
కంట్రోల్‌రూమ్ ఏర్పాటు
- విశాఖ: భారీవర్షాల వల్ల కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూమ్ ఏర్పాటు
- కంట్రోల్ రూమ్ 24 గంటలూ పనిచేస్తోంది: విశాఖ కలెక్టర్
- ఆర్‌అండ్‌బీ, విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్
- రెవెన్యూ, నీటిపారుదలశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్
- కంట్రోల్ రూమ్ హెల్ప్‌లైన్ నెంబర్లు 0891 2590100, 0891 2590102
- వినుకొండ నియోజకవర్గ వ్యాప్తంగా రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం
- వినుకొండ రూరల్ మండలంలోని ఉమ్మడివరం - పిట్టంబండ మధ్యలోని మల్లెడ వాగుకు పెరిగిన నీటి ఉదృతి
- వినుకొండ -అద్దంకి మార్గంలో రాకపోకలు నిలిపివేసిన పోలీసులు
- వాగు ఉదృతిని పరిశీలించిన వినుకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ శోభన్ బాబు
- గతంలో ఈ వాగు వద్ద జరిగిన జీపు ప్రమాదంలో 8 మంది మృతి చెందటంతో అప్రమత్తమైన అధికారులు
- ప్రకాశం: దైవదర్శనానికి వెళ్లి చిక్కుకున్న 25 మంది భక్తులుక్షేమం
- గుండ్లకమ్మ నదిని దాటించి సురక్షితంగా తీసుకువచ్చిన అధికారులు
- రాచర్ల మండలం నెమలిగుండ్ల రంగనాయకస్వామి గుడికి వెళ్లిన భక్తులు
- పల్నాడు జిల్లా: అచ్చంపేటను ముంచెత్తిన వరదనీరు
- వరదనీటిలో చిక్కుకున్న వీరభద్ర కాలనీ, రాజీవ్‌కాలనీ వాసులు
- స్థానికులను ఖాళీ చేయించి, పునరావాస కేంద్రానికి తరలించిన పోలీసులు
- గుంటూరు: లామ్ వాగులో కొట్టుకుపోయిన ముగ్గురు యువకులు
- తాళ్ల సాయంతో ఇద్దరిని ఒడ్డుకు చేర్చిన పోలీసులు, గ్రామస్థులు
- చెట్టుకొమ్మ పట్టుకుని ఉన్న మరో వ్యక్తిని కాపాడేందుకు ప్రయత్నం
- ఎన్టీఆర్ జిల్లా: నందిగామ శివారు అనాసాగరం వద్ద హైవేపై వరదనీరు
- పొలాలు, వాగుల నుంచి హైవేపైకి వస్తున్న వరద ప్రవాహం
- ప్రస్తుతం మెల్లగా కొనసాగుతున్న వాహనాల రాకపోకలు
- విద్యుత్‌శాఖ అధికారులతో మంత్రి గొట్టిపాటి రవి నిరంతర సమీక్ష
- విద్యుత్ అంతరాయాలపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయన్న అధికారులు
- విజయవాడ నుంచే ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయన్న అధికారులు
- సీపీడీసీఎల్ పరిధిలో ఇప్పటివరకు 1,314 ఫిర్యాదులు వచ్చాయి: గొట్టిపాటి
- 210 ఫిర్యాదులు పరిష్కరించాం: మంత్రి గొట్టిపాటి రవి
- విద్యుత్‌శాఖ సిబ్బంది 24 గంటలూ పనిచేస్తున్నారు: మంత్రి గొట్టిపాటి రవి
- భారీవర్షాలపై ఎన్టీఆర్ జిల్లా నేతలతో చర్చించిన మంత్రి గొట్టిపాటి
- భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు నిరంతర సమీక్ష
- వర్షాల ప్రాంతాల్లో పరిస్థితులు, సహాయ చర్యలపై సమీక్షిస్తున్న సీఎం
- సీఎస్, డీజీపీ, మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలతో మరోసారి టెలీకాన్ఫరెన్స్
- సహాయచర్యల కోసం జిల్లాకు రూ.3 కోట్లు చొప్పున తక్షణ సాయం: సీఎం
- భారీవర్షాల వల్ల 8 మంది చనిపోయినట్లు సీఎంకు వివరించిన అధికారులు
- బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం
- వర్షాల దృష్ట్యా ప్రతి ప్రభుత్వ విభాగం పూర్తి అప్రమత్తంగా ఉండాలన్న సీఎం
- తుపాను రాత్రికి శ్రీకాకుళం-విశాఖ మధ్య తీరం దాటుతుందని అంచనా
- ఉత్తరాంధ్ర జిల్లాల తీరప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలన్న సీఎం
- ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశం
- తీరం దాటేటప్పుడు 55-65 కి.మీ వేగంతో గాలులు వీస్తాయన్న అధికారులు
తుపాను తీరం దాటే వేళ గాలులపై స్పష్టమైన అంచనాతో ఉండాలన్న సీఎం
తుపాను వేగం, ప్రయాణ దిశకు అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేయాలన్న సీఎం - నష్టం తగ్గించేలా అధికారుల పనితీరు ఉండాలన్న సీఎం చంద్రబాబు
- వర్షాలు తగ్గేవరకు బయటకు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి: సీఎం చంద్రబాబు
- భారీవర్షాల దృష్ట్యా ప్రజలు రేపు కూడా జాగ్రత్తలు పాటించాలి: సీఎం
- పట్టణాల్లో నీరు నిలిచిన చోట తక్షణ చర్యలు తీసుకోవాలి: సీఎం చంద్రబాబు
- నీటి ప్రవాహాలకు ఉన్న అడ్డంకులను పొక్లెయిన్లతో తొలగించాలి: సీఎం
- ఓపెన్ డ్రెయిన్లు ఉండేచోట హెచ్చరికలు జారీ చేయాలి: సీఎం చంద్రబాబు
- వరద ప్రాంతాల్లో వాగులపై వాహనాలను అనుమతించవద్దు: సీఎం చంద్రబాబు
- ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న వంతెనలపై రాకపోకలు నిలిపేయాలి: సీఎం
- విజయవాడ రోడ్ల నుంచి నీరు బయటకు పంపే చర్యలు వివరించిన అధికారులు
- విద్యుత్ ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్న సీఎం
- విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు వచ్చిన వెంటనే స్పందించాలి: సీఎం చంద్రబాబు
- తుపాను భవనాలు సిద్ధం చేసి పునరావాసానికి ఏర్పాట్లు చేయాలి: సీఎం
- భారీవర్షాలున్న జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించాలన్న సీఎం
- అధికారుల నిర్లక్ష్యం వల్ల చిన్న ఘటన జరిగినా సహించేది లేదు: సీఎం
- హుద్‌హుద్ వేళ తీసుకున్న విధానాలు అనుసరించాలి: సీఎం చంద్రబాబు
రూ.5 లక్షల పరిహారం
- గుంటూరు: ఉప్పలపాడు ఘటన మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటన
- ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల పరిహారం ప్రకటించిన ఎమ్మెల్యే ధూళిపాళ్ల
- మృతుల కుటుంబసభ్యులను పరామర్శించిన ధైర్యం చెప్పిన ధూళిపాళ్ల
- డ్రెయిన్‌లో కారు కొట్టుకుపోయి ఉపాధ్యాయుడు, ఇద్దరు విద్యార్థులు మృతి
- భారీ వర్షాలు, వరదలపై సీఎస్ నీరభ్‌కుమార్ ప్రసాద్ సమీక్ష
- లోతట్టుప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశం
- ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశం
- విజయవాడ: రాళ్ల మధ్య సంతోష్ అనే యువకుడి మృతదేహం లభ్యం
- కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఐదుకు చేరిన మృతులు
- కల్లు వద్ద ముగ్గురికి తప్పిన ప్రాణాపాయం
- వాగులో కొట్టుకుపోతున్న ముగ్గురిని కాపాడిన పోలీసులు
- నెకల్లు వద్ద వాగు ఉద్ధృతికి కొట్టుకుపోయిన ఆటో
- వాగులోని చెట్టును పట్టుకుని ఉన్న ముగ్గురు వ్యక్తులు
- ముగ్గురినీ కాపాడిన ఎస్‌ఐ అంజయ్య, హెడ్‌కానిస్టేబుల్ అంకమరావు
- భారీ వర్షాల దృష్ట్యా సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు
- సీసీఎల్‌ఏ జయలక్ష్మి ఆధ్వర్యంలో 19 మంది అధికారులతో కమిటీ
- కమిటీలో 17 శాఖలకు చెందిన అధికారులకు చోటు
- ప్రతి జిల్లాలోనూ కమాండ్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు
- నాలుగు ప్రాంతాలకు నలుగురు అధికారుల నియామకం
- ఆర్‌టీజీఎస్ కంట్రోల్ రూమ్‌కు ఐఏఎస్ కోన శశిధర్ నియామకం
- 14,700కు పైగా ఉన్న సీసీ కెమెరాల ఫీడ్ విశ్లేషించనున్న అధికారులు
- కంట్రోల్ రూమ్‌లు పెట్టాలని ఆర్‌అండ్‌బీ, విద్యుత్, మున్సిపల్ శాఖలకు అదేశం
- వర్షాలు, వరదలపై సమీక్ష జరిపి సహాయచర్యలు చేపట్టాలన్న ప్రభుత్వం
- మంగళగిరి: నిడమర చెరువుకు గండి, ఎస్సీ కాలనీలోకి వరదనీరు
- పల్నాడు జిల్లా: మాచర్లలోని ఎత్తిపోతలకు పెరిగిన వరద ప్రవాహం
- వాగుల ద్వారా ఎత్తిపోతలకు భారీగా చేరుకుంటున్న వరదనీరు
- 70 అడుగుల ఎత్తు నుంచి నీరుపడి పర్యాటకులను ఆకర్షిస్తున్న ఎత్తిపోతల
నిడమర చెరువుకు గండి
- భారీ వర్షాల దృష్ట్యా సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు
- సీసీఎల్‌ఏ జయలక్ష్మి ఆధ్వర్యంలో 19 మంది అధికారులతో కమిటీ
- కమిటీలో 17 శాఖలకు చెందిన అధికారులకు చోటు
- ప్రతి జిల్లాలోనూ కమాండ్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు
- నాలుగు ప్రాంతాలకు నలుగురు అధికారుల నియామకం
- ఆర్‌టీజీఎస్ కంట్రోల్ రూమ్‌కు ఐఏఎస్ కోన శశిధర్ నియామకం
- 14,700కు పైగా ఉన్న సీసీ కెమెరాల ఫీడ్ విశ్లేషించనున్న అధికారులు
- కంట్రోల్ రూమ్‌లు పెట్టాలని ఆర్‌అండ్‌బీ, విద్యుత్, మున్సిపల్ శాఖలకు అదేశం
- వర్షాలు, వరదలపై సమీక్ష జరిపి సహాయచర్యలు చేపట్టాలన్న ప్రభుత్వం
- మంగళగిరి: నిడమర చెరువుకు గండి, ఎస్సీ కాలనీలోకి వరదనీరు
- పల్నాడు జిల్లా: మాచర్లలోని ఎత్తిపోతలకు పెరిగిన వరద ప్రవాహం
- వాగుల ద్వారా ఎత్తిపోతలకు భారీగా చేరుకుంటున్న వరదనీరు
- 70 అడుగుల ఎత్తు నుంచి నీరుపడి పర్యాటకులను ఆకర్షిస్తున్న ఎత్తిపోతల
- తిరుమలలో కూలిన భారీ వృక్షం, మహిళకు గాయాలు
- చెన్నైకు చెందిన మహిళ ఉమామహేశ్వరికి గాయాలు, స్విమ్స్‌కు తరలింపు
- రాష్ట్రంలో కుండపోతగా వానలు, భారీగా వర్షపాతం నమోదు
- రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల 5 సెంటిమీటర్ల కంటే అధికంగా వర్షపాతం నమోదు
- ఎన్డీఆర్ జిల్లా మైలవరంలో అత్యధికంగా 21.95 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు
- గుంటూరు జిల్లా తెనాలిలో 17.8 సెంటిమీటర్ల వర్షపాతం
- మంగళగరిలో 15.4 సెంటిమీటర్ల వర్షపాతం
- ఏలూరు జిల్లా నూజివీడులో 15 సెంటిమీటర్లు
- బాపట్లలో 11 సెంటిమీటర్లు
- పలనాడులో 10 సెంటిమీటర్లు
- కృష్ణా జిల్లా 9 సెంటిమీటర్ల వర్షపాతం
- విజయవాడ: ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డులో పడిన కొండచరియలు
- విజయవాడ: పూర్తిగా నేలమట్టమైన ప్రొటోకాల్ ఆఫీసు, డోనార్ సెల్
- విజయవాడ: కొండచరియలు పడిన ప్రాంతాన్ని పరిశీలించిన హోంమంత్రి
- సహాయ చర్యల గురించి హోంమంత్రి అనితకు వివరించిన అధికారులు
- కొండ పక్కన ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాం: అనిత
- మొగల్రాజపురంలో వైద్యశిబిరం ఏర్పాటు చేస్తున్నాం: హోంమంత్రి అనిత
- ఎన్టీఆర్ జిల్లా: గంపలగూడెం మం. పెనుగొలనులో నల్లచెరువుకు గండి
ఆయకట్టు కింద పంటలను ముంచెత్తిన వరదనీరు, రైతుల ఆందోళన
- మంగళగిరి: గండాలయ్యపేటలో విరిగిపడిన కొండచరియలు, వృద్ధురాలు మృతి
- ఇంట్లో ఉన్న నాగరత్నమ్మపై రాయిపడి అక్కడికక్కడే మృతి
- మంగళగిరిలో భారీ వర్షాలపై మంత్రి నారా లోకేష్ సమీక్ష
- ప్రకాశం: రాచర్ల మండలం అటవీప్రాంతంలో చిక్కుకున్న భక్తులు
- నెమలిగుండ్ల రంగనాయకస్వామి గుడికి వెళ్లిన 25 మంది భక్తులు
- గుండ్లకమ్మ ఉద్ధృత ప్రవాహం వల్ల అవతలివైపు చిక్కుకుపోయిన భక్తులు
- ఏలూరు: నూజివీడు దుర్గమ్మగుడి వద్ద పెద్దచెరువుకు గండి
- పెద్దచెరువు నీటితో జలదిగ్బంధంలో చిక్కుకున్న 50 ఇళ్లు
- ఇళ్లలో చిక్కుకుపోయిన 10 మంది స్థానికులు
- ఇళ్లలో చిక్కుకున్న వారిని రక్షించాలని స్థానికుల డిమాండ్
- గుంటూరు జిల్లాలో వాగులో కొట్టుకుపోయిన కారు, ముగ్గురు మృతి
- గుంటూరు: పెదకాకాని మండలం ఉప్పలపాడులో ఘటన
- నంబూరు పాఠశాలలో పనిచేస్తున్న రాఘవేంద్ర అనే వ్యక్తి
- పాఠశాలకు సెలవు ఇవ్వడంతో ఇద్దరు పిల్లలను తీసుకుని వస్తుండగా ఘటన
- రోడ్డుపై డ్రెయిన్ నీరు ప్రవహిస్తున్నా ఆగకుండా వెళ్లిన రాఘవేంద్ర
- మురుగునీటి ఉద్ధృతికి కొట్టుకుపోయిన కారు, ముగ్గురు మృతి
- ప్రమాదంలో రాఘవేంద్ర, చిన్నారులు సాత్విక్, మానిక్ మృతి
- కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లతో మంత్రి కొల్లు టెలీకాన్ఫరెన్స్
- భారీ వర్షాలపై ప్రజలను అప్రమత్తం చేయాలి: మంత్రి కొల్లు
- లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి: కొల్లు
- గుంటూరు జిల్లాలో వాగులో కొట్టుకుపోయిన కారు
- ముగ్గురు మృతి
- మంగళగిరి: కాజా టోల్‌గేట్ వద్ద 3 కిలోమీటర్లు నిలిచిన వాహనాలు
- వరదనీరు వల్ల టోల్‌గేట్ ఇరువైపులా నిలిచిన వాహనాలు
- నరసరావుపేట నియోజకవర్గంలో రెండ్రోజులుగా వర్షం
- నరసరావుపేట, రొంపిచర్ల ప్రజల రాకపోకలకు ఇబ్బందులు
- రొంపిచర్లలో రోడ్లపై ప్రవహిస్తున్న వాగులు, రాకపోకలకు అంతరాయం
- పల్నాడు జిల్లా: రొంపిచర్ల మండలంలో నీటమునిగిన పొలాలు
- నరసరావుపేట మం. అచ్చమ్మపాలెంలో ఇళ్లలోకి చేరిన వర్షపునీరు
- విజయవాడ, గుంటూరులో భారీ వర్షం
- చెరువులను తలపిస్తున్న రహదారులు
- భారీ వర్షాలపై హోం, విపత్తు నిర్వహణ శాఖల అప్రమత్తం
- జిల్లా కలెక్టర్లతో ఫోన్‌లో మాట్లాడిన హోంశాఖ మంత్రి అనిత
- వరద ప్రాంతాల్లో సహాయచర్యలకు ప్రత్యేక బలగాలు వెళ్లాలని ఆదేశం
- ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలన్న హోంశాఖ మంత్రి అనిత
- విజయవాడ:కొండచరియలు పడి నలుగురు చనిపోవడంపై విచారం వ్యక్తం చేసిన సీఎం
- మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున పరిహారం: సీఎం
- మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది: చంద్రబాబు
- స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి: సీఎం చంద్రబాబు
- విజయవాడ: కొండచరియలు పడిన ఘటనలో 4కు చేరిన మృతులు
- కొండచరియలు పడి మేఘన, లక్ష్మి, అన్నపూర్ణ, లాలో పుర్కాయత్ మృతి
- ఏలూరు జిల్లాలో భారీ వర్షాలపై మంత్రి పార్థసారథి సమీక్ష
- తమ్మిలేరు ఉద్ధృతి, విద్యుత్ సమస్యలు, ప్రజారోగ్యంపై సమీక్ష
- ఏలూరు: కలెక్టర్, అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి పార్థసారథి
- శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు
- శ్రీకాకుళం: అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి అచ్చెన్నాయుడు
- అన్ని శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలన్న మంత్రి
- మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని మంత్రి అచ్చెన్నాయుడు సూచన
- గుంటూరు: పెదాకాకాని మండలంలోని నంబూరు చెరువు ఉద్ధృతి
- గ్రామంలోని ఇళ్లలోకి చేరిన నీరు, జలమయమైన వీధులు
- కోనసీమ జిల్లా: నాగులంక వద్ద గుడాయిలంకలో వ్యక్తి మృతి
- ప్రమాదవశాత్తూ మురుగుకాలువలో పడిపోయి వ్యక్తి మృతి
మంగళగిరి టోల్‌ప్లాజా వద్ద రాకపోకలకు తీవ్ర అంతరాయం
- మంగళగిరి టోల్‌ప్లాజా వద్ద రాకపోకలకు తీవ్ర అంతరాయం
- గుంటూరు ఆటోనగర్, పెద్దకాకాని పీఎస్ సమీపమంతా జలమయం
- టోల్‌గేట్ వద్ద ప్రధాన రహదారిపైకి భారీగా నీటి చేరికతో ట్రాఫిక్ ఇబ్బందులు
- వరద నీటితో జలాశయాన్ని తలపిస్తున్న మంగళగిరి టోల్‌ప్లాజా ప్రాంతం
- గుంటూరు, విజయవాడ ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు
- ప్రయాణికులు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారుల విజ్ఞప్తి
విజయవాడ దుర్గగుడి ఫ్లైఓవర్ తాత్కాలికంగా మూసివేత
- విజయవాడ దుర్గగుడి ఫ్లైఓవర్ తాత్కాలికంగా మూసివేత
- విజయవాడ: బ్రిడ్జి వద్ద వర్షపు నీటిలో చిక్కుకున్న 3 బస్సులు, లారీ
కొండచరియలు విరిగిపడిన ఘటనలో 4కు చేరిన మృతులు
- విజయవాడ కొండచరియలు విరిగిపడిన ఘటనలో 4కు చేరిన మృతులు
- మొగల్రాజపురం సున్నపుబట్టి సెంటర్ వద్ద ఉదయం విరిగిపడిన కొండచరియలు
- కొండచరియలు విరిగిపడిన ఘటనలో మేఘన, లక్ష్మి, అన్నపూర్ణ మృతి
- కొండచరియలు విరిగిపడి మరో ఐదుగురికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు
- రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు విరిగిపడిన కొండచరియలు
- విజయవాడ: కొండచరియలు విరిగిపడి పలు ఇళ్లు ధ్వంసం
ఇళ్లలోకి చేరుతున్న చెరువు నీరు
- గుంటూరు నగరంలో పొంగిన గడ్డిపాడు చెరువు
- గడ్డిపాడులో ఇళ్లలోకి చేరుతున్న చెరువు నీరు
- ఇళ్లలోకి నీరు రావడంతో ఇబ్బందిపడుతున్న జనం
ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు
- పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో భారీ వర్షాలు
- వర్షపు నీరు రోడ్లమీద చేరడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు
- పంట పొలాల్లో నీరు చేరడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు
పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం
- పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం
- ఇవాళ అర్ధరాత్రి కళింగపట్నం వద్ద తీరాన్ని దాటే అవకాశం
- వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు అవకాశం
- కృష్ణా, గోదావరి, వంశధార, గోస్తని నదుల్లో వరద ఉద్ధృతి పెరిగే అవకాశం
- సువర్ణముఖి, శారద, వరాహా నదుల్లో వరద ఉద్ధృతి పెరిగే అవకాశం
- శబరి, తమ్మిలేరు, ఏలేరు నదుల్లో వరద ఉద్ధృతి పెరిగే అవకాశం
- ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలో లోతట్టు ప్రాంతాలకు వరదనీరు చేరే అవకాశం
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ
- వివిధ బ్యారేజీలు, రిజర్వాయర్‌ల నుంచి నీటిని విడుదల చేయనున్న అధికారులు
- దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తం ఉండాలని హెచ్చరికలు
కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇద్దరు మృతి
- విజయవాడ మొగల్రాజపురంలో విరిగిపడిన కొండచరియలు
- విజయవాడ: కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇద్దరు మృతి
- విజయవాడ: మృతులు మేఘన, లక్ష్మిగా గుర్తింపు
- కొండచరియలు విరిగిపడి మరో నలుగురికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు
- రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు జారిపడిన కొండచరియలు
- మొగల్రాజపురం సున్నపుబట్టి సెంటర్ వద్ద విరిగిపడిన కొండచరియలు
- విజయవాడ: కొండచరియలు విరిగిపడి పలు ఇళ్లు ధ్వంసం
- దెబ్బతిన్న ఇళ్లలో ఎంతమంది ఉన్నారో పరిశీలిస్తున్న అధికారులు
అమరావతి మండలం ధరణికోటలో వర్షం
- పల్నాడు జిల్లా: అమరావతి మండలం ధరణికోటలో వర్షం
- ధరణికోట జైల్ సింగ్ కాలనీలో ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు
దుర్గ గుడి ఘాట్‌రోడ్ మూసివేసిన ఆలయ అధికారులు
- విజయవాడ: దుర్గ గుడి ఘాట్‌రోడ్ మూసివేసిన ఆలయ అధికారులు
- కొండచరియలు విరిగిపడుతున్నందున దుర్గ గుడి ఘాట్ రోడ్ మూసివేత
- ఘాట్ రోడ్డు సమీపంలో కూలిన చెట్లను తొలగిస్తున్న వీఎంసీ సిబ్బంది
రాష్ట్రంలో మరో 3 రోజులు భారీ వర్షాలు ఉండే అవకాశం: సీఎం
- పలు శాఖల అధికారులతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- సీఎస్, డీజీపీ, మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం సమీక్ష
- ఓర్వకల్లు పర్యటన రద్దు చేసుకుని వర్షాలపై సమీక్షిస్తున్న సీఎం
- రాష్ట్రంలో మరో 3 రోజులు భారీ వర్షాలు ఉండే అవకాశం: సీఎం
- వర్షాల పట్ల అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలి: సీఎం
- అధికారుల అప్రమత్తతతో ప్రజల ఇబ్బందులు తగ్గించవచ్చు: సీఎం
- ఇరిగేషన్, రెవెన్యూ శాఖ సమన్వయంతో చెరువుల పరిస్థితిని పరిశీలించాలి: సీఎం
- పట్టణాల్లో రోడ్లపై నీరు చేరి ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగుతోంది: సీఎం
- పరిస్థితికి అనుగుణంగా ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టాలి: సీఎం
- తాగునీరు, ఆహారం కలుషితం కాకుండా దృష్టిపెట్టాలి: సీఎం
- అల్లూరి జిల్లాలో కలుషిత ఆహారం ఘటన జరిగింది: సీఎం
- అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలి: సీఎం
- కలుషిత ఆహారం ఘటనలకు కారణాలపై విచారణ జరపాలి: సీఎం
- సీజనల్ వ్యాధుల తీవ్రత దృష్ట్యా మరింత సమర్థంగా పనిచేయాలి: సీఎం
- ముఖ్యంగా జ్వరాల బారిన పడిన గిరిజనులకు వైద్యం అందేలా చూడాలి: సీఎం
- కాల్వలు, వాగులు దాటేందుకు ప్రజలను అనుమతించవద్దు: సీఎం
- వాట్సాప్ గ్రూపుల ద్వారా నిత్యం సమన్వయంతో పనిచేయాలి: సీఎం
- విపత్కర పరిస్థితుల్లో డ్రోన్లు వంటి టెక్నాలజీని విరివిగా వాడండి: సీఎం
- భారీ వర్షాలపై ప్రజల ఫోన్లకు అలెర్ట్ మెసేజ్‌లు పంపాలి: సీఎం చంద్రబాబు
- ప్రభుత్వం ఆదుకుంటుందన్న నమ్మకం కల్పించేలా అధికారులు పనిచేయాలి: సీఎం
- ప్రాజెక్టుల్లో నీటి నిల్వలను నిరంతరం పర్యవేక్షించాలి: సీఎం చంద్రబాబు
- ప్రాజెక్టుల నిర్వహణకు అవసరమైన నిధుల విడుదలకు ఆదేశాలిచ్చాం: సీఎం
- విజయవాడలో ఇంటిపై కొండచరియలు విరిగిపడటం బాధాకరం: సీఎం
- ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుంది: సీఎం
మంగళగిరిలో నీటమునిగిన రత్నాలచెరువు ప్రాంతం
- మంగళగిరిలో వర్షానికి నీటమునిగిన రత్నాలచెరువు ప్రాంతం
- ఇళ్లలోకి వరద నీటి చేరికతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు
- వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంగళగిరి తహసీల్దార్ సుభాని
- బాధితులకు ఆహార పొట్లాలు పంపిణీ చేసేందుకు అధికారుల చర్యలు
- మోకాళ్ల లోతు నీటిలో నానుతున్న టిడ్కో నివాస ప్రాంతం
శాంతినగర్‌లో చెరువుకట్ట తెగి ఇళ్లలోకి చేరుతున్న నీరు
- ఎన్టీఆర్ జిల్లా: కొండపల్లి శాంతినగర్‌లో చెరువుకట్ట తెగి ఇళ్లలోకి చేరుతున్న నీరు
- ఎన్టీఆర్ జిల్లా: ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందిని ఘటనాస్థలికి పంపిన కలెక్టర్ సృజన
ప్రకాశం బ్యారేజీకి కొనసాగుతున్న వరద ఉద్ధృతి
- ప్రకాశం బ్యారేజీకి కొనసాగుతున్న వరద ఉద్ధృతి
- ప్రకాశం బ్యారేజీకి 3,24,006 క్యూసెక్కుల వరద ప్రవాహం
- మొత్తం 70 గేట్లు ఎత్తి 3,20,499 క్యూసెక్కులు దిగువకు విడుదల
- ప్రకాశం బ్యారేజ్ నుంచి కాల్వలకు 3,507 క్యూసెక్కులు విడుదల
గుంటూరు జిల్లాలో వర్షాలపై అప్రమత్తమైన కలెక్టర్
- గుంటూరు జిల్లాలో వర్షాలపై అప్రమత్తమైన కలెక్టర్
- గుంటూరు జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
- 0863 2234014కు ఫోన్ చేసి సమస్యలు తెలపవచ్చు: కలెక్టర్
- ప్రత్యేక కంట్రోల్ రూమ్ 24 గంటలు పనిచేస్తుంది: కలెక్టర్
విజయవాడ రామవరప్పాడు రింగ్‌రోడ్ వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు
- విజయవాడ రామవరప్పాడు రింగ్‌రోడ్ వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు
- రింగ్‌రోడ్ నుంచి నిడమానూరు వరకు ట్రాఫిక్ ఇబ్బందులు
- వర్షపు నీటిలో కార్లు, బైకులు ఆగిపోవటంతో నిలిచిన రాకపోకలు
ప్రజలు బయటకు రావద్దు: మంత్రి లోకేశ్
- వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు బయటకు రావద్దు: మంత్రి లోకేశ్
- ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి: లోకేశ్
- ప్రభుత్వం, విపత్తు నిర్వహణ శాఖ అలెర్ట్ మెసేజ్‌లు గమనించండి: లోకేశ్
- లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలి: లోకేశ్
- వరద ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ నేతలు పూర్తి సహకారం అందించాలి: లోకేశ్
- విపత్తుల కష్ట సమయంలో టీడీపీ అండగా ఉంటుందనే భరోసా కల్పించాలి: లోకేశ్
విజయవాడలో వర్షాల పరిస్థితిపై కలెక్టర్ సృజన సమీక్ష
- విజయవాడలో వర్షాల పరిస్థితిపై కంట్రోల్‌రూమ్‌లో కలెక్టర్ సృజన సమీక్ష
- మెున్నటినుంచి కురుస్తున్న వర్షాలకు జరిగిన నష్టాల వివరాలపై కలెక్టర్ ఆరా
- కొండప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
- వర్షం తగ్గి రోడ్లపై నీరు తగ్గేంతవరకు బయటకు ప్రజలు రావద్దని అధికారుల విజ్ఞప్తి
భారీ వర్షాలపై అధికారులను అప్రమత్తం చేసిన ఎంపీ శివనాథ్
- విజయవాడ: భారీ వర్షాలపై అధికారులను అప్రమత్తం చేసిన ఎంపీ శివనాథ్
- అధికారులతో ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తున్న ఎంపీ కేశినేని శివనాథ్
- అవసరమైన సహాయచర్యలు తక్షణమే చేపట్టాలని ఎంపీ శివనాథ్ ఆదేశాలు
- వాగులు, వంకల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశం
- కృష్ణా నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎంపీ శివనాథ్
- లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలి: ఎంపీ శివనాథ్
కొల్లేరు సరస్సులోకి ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద నీరు
- ఏలూరు జిల్లాలో భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం
- కైకలూరు, కలిదిండి మండలాల్లో పంట పొలాల్లోకి భారీగా వర్షపు నీరు
- మండవల్లి, ముదినేపల్లి మండలాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం
- కొల్లేరు సరస్సులోకి ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద నీరు
- వణుదుర్రులో పంట కాల్వకు గండిపడి నీటమునిగిన వరి చేలు
చెరువులను తలపిస్తున్న విజయవాడ రహదారులు
- భారీ వర్షానికి చెరువులను తలపిస్తున్న విజయవాడ రహదారులు
- విజయవాడ విద్యాధరపురం, ఆర్‌ఆర్‌నగర్‌లో రహదారులు జలమయం
- విజయవాడ: రహదారులపై మోకాళ్ల లోతు నీటిలో వాహనాల రాకపోకలు
కొండచరియలు విరిగిపడి 30 మేకలు మృతి
- కృష్ణా జిల్లా యనమలకుదురులో విరిగిపడిన కొండచరియలు
- యనమలకుదురులో కొండచరియలు విరిగిపడి 30 మేకలు మృతి
కొండచరియలు విరిగిపడిన ఘటనలో బాలిక మృతి
- విజయవాడ మొగల్రాజపురంలో విరిగిపడిన కొండచరియలు
- విజయవాడ: కొండచరియలు విరిగిపడిన ఘటనలో బాలిక మృతి
- శిథిలాల కింద చిక్కుకున్న మహిళను ఆస్పత్రికి తరలించిన సిబ్బంది
- రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు జారిపడిన కొండచరియలు
- మొగల్రాజపురం సున్నపుబట్టి సెంటర్ వద్ద విరిగిపడిన కొండచరియలు
- విజయవాడ: కొండచరియలు విరిగిపడి పలు ఇళ్లు ధ్వంసం
- దెబ్బతిన్న ఇళ్లలో ఎంతమంది ఉన్నారో పరిశీలిస్తున్న అధికారులు
విద్యుత్ అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి గొట్టిపాటి
- వర్షాల దృష్ట్యా విద్యుత్ అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి గొట్టిపాటి
- ప్రజలకు ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని మంత్రి సూచనలు
- ప్రజలకు విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని మంత్రి గొట్టిపాటి ఆదేశం
- ప్రమాదాల నివారణపై అధికారులు దృష్టి సారించాలి: మంత్రి గొట్టిపాటి రవికుమార్
- విద్యుత్ తీగలు తెగిపడిన వెంటనే అధికారులకు సమాచారం అందించాలి: గొట్టిపాటి
- ప్రజల ఫిర్యాదులపై అధికారులు అలసత్యం వహిస్తే కఠిన చర్యలు: మంత్రి గొట్టిపాటి
మొగల్రాజపురంలో విరిగిపడిన కొండచరియలు
- విజయవాడ మొగల్రాజపురంలో విరిగిపడిన కొండచరియలు
- మొగల్రాజపురం సున్నబట్టి సెంటర్ వద్ద విరిగిపడిన కొండచరియలు
- విజయవాడ: కొండచరియలు విరిగిపడి పలువురికి గాయాలు
- ఘటనాస్థలికి వెళ్లి పరిశీలిస్తున్న విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్
- రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి జారిపడిన కొండచరియలు
- పూర్తిగా దెబ్బతిన్న ఇల్లు, పాక్షికంగా దెబ్బతిన్న మరో మూడిళ్లు
- విజయవాడ: గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించిన పోలీసులు
- పూర్తిగా దెబ్బతిన్న ఇంట్లో ఇద్దరు ఉన్నట్లు చెబుతున్న స్థానికులు
రాకపోకలకు అంతరాయం
- ఏలూరు జిల్లా: జంగారెడ్డిగూడెం, బుట్టాయిగూడెంలో వర్షం
- ఏలూరు జిల్లా: పోలవరం, కొయ్యలగూడెంలో ఎడతెరిపి లేని వర్షం
- పెదపాడు మం. కొత్తూరు వద్ద నేలకొరిగిన భారీ వృక్షం, రాకపోకలకు అంతరాయం
నల్లవాగు, వైరా, కట్టలేరు ఉద్ధృతి
- ఎన్టీఆర్ జిల్లా: నందిగామ మండలంలో నల్లవాగు, వైరా, కట్టలేరు ఉద్ధృతి
- అడిరావులపాడు వద్ద నల్లవాగు పొంగి రామన్నపేట-నందిగామ మార్గంలో నిలిచిన రాకపోకలు
- ఎన్టీఆర్ జిల్లా: దాములూరు-వీరులపాడు మధ్య నిలిచిన రాకపోకలు
భారీ వర్షాలకు వాగులు, వంకల్లో భారీగా వరద
- పల్నాడు జిల్లా అచ్చంపేటలో ఈదురుగాలులతో వర్షం
- పల్నాడు జిల్లా: భారీ వర్షాలకు వాగులు, వంకల్లో భారీగా వరద
- ప్రధాన రహదారిపై 4 అడుగుల మేర నీటి ప్రవాహం
- వరదలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సును ట్రాక్టర్‌తో లాగేందుకు యత్నం
- అచ్చంపేటలో విద్యుత్ ఉపకేంద్రాన్ని చుట్టుముట్టిన వరద
- కెనాల్ కార్యాలయంలోకి ప్రవహించిన వరద ప్రవాహం
భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- రాష్ట్రంలో భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- రాష్ట్రంలో వర్షాల పరిస్థితులపై అధికారులతో మాట్లాడిన సీఎం
- అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు సూచనలు చేయాలి: సీఎం
- అవసరమైన సహాయచర్యలకు ప్రభుత్వ సిబ్బంది సిద్ధంగా ఉండాలి: సీఎం
- మ్యాన్‌హోల్, కరెంట్ తీగలు తెగిపడే ప్రమాదాలు జరగకుండా చూడాలి: సీఎం
- భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలి: సీఎం
- వాగులు, వంకల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి: సీఎం
- ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా చూడాలి: సీఎం చంద్రబాబు
- భారీ వర్షాల ప్రాంతాల్లో ప్రజలకు అలర్ట్ మెసేజ్‌లు పంపాలి: సీఎం చంద్రబాబు
పశ్చిమ గోదావరి జిల్లావ్యాప్తంగా రాత్రి నుంచి వర్షం
- ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లావ్యాప్తంగా రాత్రి నుంచి వర్షం
- తణుకులో వర్షంలోనూ పింఛన్ల పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ
అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి నారాయణ
- విజయవాడలో వర్షంపై అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి నారాయణ
- నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రతో ఫోన్లో మాట్లాడిన మంత్రి నారాయణ
- వర్షంతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించిన మంత్రి నారాయణ
- లోతట్టు ప్రాంతాలు, రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా చర్యలకు ఆదేశాలు
- డ్రెయినేజీ వ్యవస్థకు ఆటంకం లేకుండా సిబ్బందిని అప్రమత్తం చేయాలని సూచన
రాజధాని గ్రామాల్లో రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం
- గుంటూరు జిల్లా రాజధాని గ్రామాల్లో రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం
- గుంటూరు-తుళ్లూరు రహదారిలో పెదపరిమి వద్ద కోటేళ్లవాగు ఉద్ధృతి
- గుంటూరు: కోటేళ్లవాగు ఉద్ధృతితో వాహనాల రాకపోకలకు అంతరాయం
- గుంటూరు జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన డీఈవో
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: విపత్తుల నిర్వహణ సంస్థ
- వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం: విపత్తుల నిర్వహణ సంస్థ
- ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం
- అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు: విపత్తుల నిర్వహణ సంస్థ
- ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు
- ఇవాళ మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు
- కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం
- అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం
- మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
- కోస్తా తీరం వెంబడి గంటకు 45-65 కి.మీ. వేగంతో ఈదురుగాలులు
- లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: విపత్తుల నిర్వహణ సంస్థ
ఎన్టీఆర్ జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు
- ఎన్టీఆర్ జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు
- విజయవాడలో ఎడతెరపి లేని వర్షం, రహదారులు జలమయం
- అన్ని యాజమాన్య పాఠశాలలకు సెలవు ప్రకటించిన కలెక్టర్ సృజన
- ఎ.కొండూరు మం. కృష్ణారావుపాలెం-కేశ్యాతండా మధ్య వాగులో వరద
- ఎన్టీఆర్ జిల్లా: వాగులో వరద ప్రవాహానికి రాకపోకలకు అంతరాయం
- ప్రకాశం బ్యారేజ్‌లోని మొత్తం 70 గేట్లు ఎత్తి నీటి విడుదల
- ప్రకాశం బ్యారేజ్ నుంచి 3,32,374 క్యూసెక్కుల నీరు విడుదల
- కృష్ణా నదీ పరివాహక ప్రాంతాలను అప్రమత్తం చేసిన కలెక్టర్
శ్రీశైలం జలాశయం 9 గేట్లు ఎత్తి నీటి విడుదల
- శ్రీశైలం జలాశయం 9 గేట్లు ఎత్తి నీటి విడుదల
- స్పిల్‌వే ద్వారా 2.52 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల
- జూరాల జలాశయం నుంచి శ్రీశైలానికి 3.27లక్షల క్యూసెక్కులు
- నిండుకుండలా మారిన శ్రీశైలం జలాశయం
- శ్రీశైలం జలాశయం ప్రస్తుత, పూర్తి నీటిమట్టం 885 అడుగులు
- శ్రీశైలం జలాశయం ప్రస్తుత, పూర్తి నీటినిల్వ 215.8 టీఎంసీలు
- కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో ముమ్మరంగా విద్యుదుత్పత్తి
- విద్యుదుత్పత్తితో 68,402 క్యూసెక్కుల నీరు సాగర్‌కు విడుదల
పాఠశాలలకు సెలవు ప్రకటన
- విశాఖలో ఎడతెరిపి లేని వర్షాలకు పాఠశాలలకు సెలవు ప్రకటన
- విశాఖలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు
- కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశాల మేరకు సెలవు ప్రకటించిన విద్యాశాఖ
నిన్నటి నుంచి ఎడతెరిపిలేని వర్షం
- బాపట్ల జిల్లాలో పలుప్రాంతాల్లో నిన్నటి నుంచి ఎడతెరిపిలేని వర్షం
- చీరాల, వేటపాలెం, చినగంజాం, ఇంకొల్లులో వర్షం
- పర్చూరు, మార్టూరు, యద్దనపూడి, కారంచేడులో వర్షం
- బాపట్లలో ఈదురు గాలుతో కురుస్తున్న కుండపోత వర్షం
రాష్ట్రంలో భారీ నుంచి మోస్తరు వర్షాలు
- నేడు, రేపు రాష్ట్రంలో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
- నేడు తీరంలో 45-65 కి.మీ వేగంతో గాలులు: విపత్తుల నిర్వహణ సంస్థ
- మత్స్యకారులు వేటకు వెళ్లకూడదు: విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్
- తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: విపత్తుల నిర్వహణ సంస్థ
Last Updated : Aug 31, 2024, 10:35 PM IST