Heavy Rain Alert To Telangana For Next Five Days :రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట జిల్లాలో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. మహాబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల భారీ వర్షాలు పడతాయని, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.
అవసరమైతేనే బయటకు రండి :కాగా సోమవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని ఐఎండీ సూచించింది. భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. సూర్యాపేట, వరంగల్, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో వానలు పడతాయని వివరించింది. ఆదివారం నారాయణపేట, గద్వాల్ జిల్లాలకు కూడా ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. వర్షాల దృష్యా ఎవరూ బయటకు రావొద్దని, అత్యవసర పరిస్థితుల్లోనే రావాలని సూచించింది. వర్షాల సూచనతో హైదరాబాద్ బల్దీయా రంగంలోకి దిగింది. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా రోడ్లపై నీరు ఆగకుండా చర్యలు తీసుకుంటున్నారు. చిన్నపిల్లలు బయటకు రావొద్దని సూచించారు.