Harish Rao to Fight MLC Kavitha Illegal Arrest in the Supreme Court : ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టును సుప్రీంకోర్టు(Supreme Court)లో పిటిషన్ వేసి పోరాడతామని తెలంగాణ బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావు తెలిపారు. న్యాయవ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. కవిత అరెస్టును న్యాయపరంగా పోరాడుతామని చెప్పారు. అక్రమ అరెస్టుకు నిరసనగా ఉద్యమిస్తామని అందులో భాగంగా రేపు(శనివారం) రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావు మాట్లాడుతూ అప్రజాస్వామిక చర్యలకు నిరసనగా రేపు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నామని తెలిపారు. దుర్మార్గపు చర్యను బీఆర్‌ఎస్ ప్రజాక్షేత్రంలోనే ఎదుర్కొంటుందని అన్నారు. దుర్మార్గపు చర్యలపై బీజేపీ, కాంగ్రెస్‌కు ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదన్నారు. న్యాయవ్యవస్థపై తమకు పూర్తి విశ్వాసం ఉందని పేర్కొన్నారు. కవిత అరెస్టు(Delhi Liquor Case)పై న్యాయపరంగా పోరాడుతామని వివరించారు. పోరాటాలు, అక్రమ కేసులు ఎదుర్కోవడం తమకు కొత్త ఏం కాదని గుర్తు చేశారు.
కవిత అరెస్టు అప్రజాస్వామికం, అక్రమం, అనైతికమని బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావు ధ్వజమెత్తారు. రాజకీయ దురుద్దేశంతో పథకం ప్రకారం కుట్రతో అరెస్టు చేశారని ఆరోపించారు. అరెస్టు గురించి బీజేపీ నేతలు గతంలో పలుమార్లు మాట్లాడారన్నారు. శనివారంలోక్‌సభ షెడ్యూల్ రానుందని, ఈ క్రమంలో బీఆర్‌ఎస్, కేసీఆర్‌లను నైతికంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయంగా లబ్ధి పొందాలని బీజేపీ, కాంగ్రెస్ కుట్ర చేస్తున్నాయని విమర్శించారు.
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ - దిల్లీకి తరలింపు