తెలంగాణ

telangana

ETV Bharat / state

దీపావళి శుభాకాంక్షలు వెరీ స్పెషల్​గా చెప్పండిలా - మీ ఆత్మీయుల ముఖం తారాజువ్వలా వెలిగిపోతుంది! - DIWALI 2024 GREETINGS

- మీ ప్రియమైన వారికోసం "ఈటీవీ భారత్" స్పెషల్ విషెస్

Diwali 2024 Wishes
HAPPY DIWALI 2024 (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 30, 2024, 9:30 AM IST

Diwali 2024 Special Wishes in Telugu : చీకటిని పారదోలుతూ చెడు మీద గెలిచిన మంచికి గుర్తుగా దీపావళి పండుగను జరుపుకుంటాం. కొత్తబట్టలు, పిండివంటలు, కాంతులు విరజిమ్మే టపాసులు, అందమైన దీపాలతో వెలిగిపోయే నివాసాలతో యావత్ దేశం సంబరాల్లో మునిగిపోతుంది. ఇంతటి, అద్వితీయ క్షణాల వేళ మీ ఆత్మీయులకు దీపావళి పండుగ(Diwali 2024) శుభాకాంక్షలు ఎలా చెబుతారు? జస్ట్ "దీపావళి శుభాకాంక్షలు" అని సింగిల్​ వర్డ్​లో సింపుల్​గా కాకుండా.. "ఈటీవీ భారత్" అందిస్తున్న ఈ స్పెషల్ విషెస్​, కోట్స్​తో శుభాకాంక్షలు తెలియజేయండి. మీ ఆత్మీయుల ముఖాలు మతాబుల్లా వెలిగిపోతాయి.

  • "ఈ దీపావళి వేళ లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించి.. మీ జీవితంలో వెలుగు పూలు వికసించాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు దివాళీ శుభాకాంక్షలు"
  • "మీ ప్రేమ, అనురాగం, ఆప్యాయత నాపై ఎల్లప్పుడు కూడా ఇలానే ఉండాలని ఆకాంక్షిస్తూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు"
  • "నువ్వే నా జీవితానికి లైట్​. ఈ దీపావళి పండుగ సందర్భంగా మనం ఇద్దరూ ఒకరికొకరు వెలుగూ నీడలా తోడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. బంధుమిత్రులందరికీ హ్యాపీ దీపావళి"
  • "చీకట్లను చెరిపేసే ఈ పండుగ మీ జీవితంలో కొత్త వెలుగులు తీసుకురావాలని, కొత్త ఆశలు చిగురింపజేయాలని కోరుకుంటూ.. అందరికీ హ్యాపీ దీపావళి"
  • "చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తు దీపావళి.. మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు!"
  • "ఈ దీపావళికి మీ లైఫ్​లో చెడు అనే చీకటి తొలగిపోయి.. కాంతివంతంగా మారాలని మనస్ఫూర్తిగా విష్ చేస్తూ.. అందరికీ దీపావళి శుభాకాంక్షలు."
  • "దీపావళి వేళ వెలిగించే దీపాలు మీ ఇంట నిత్యం వెలుగులు నింపాలని, అష్టైశ్వర్యాలను సిద్ధింపజేయాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు!!"
  • "దీపావళి వేళ దీపపు కాంతి వెలుగులు.. మీ ఇంట ఆనందపు కాంతులను విరజిమ్మాలని కోరుకుంటూ.. అందరికీ దీపావళి శుభాకాంక్షలు!"
  • "సిరుల తల్లి లక్ష్మీదేవికృపాకటాక్షాలు మీ ఇంటిపై కురిసి, మీ జీవితంలో ఎప్పుడూ సుఖశాంతులు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. దీపావళి శుభాకాంక్షలు!"
  • "ఈ దీపావళి మీ జీవితంలో కొత్త అవకాశాలు తీసుకురావాలని, మీరు మరింత సమృద్ధిగా అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటున్నాను. మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు"

చిటికెలో పాత మట్టి ప్రమిదలను శుభ్రం చేయండి - దీపావళి రోజున కొత్త వాటిలా కనిపిస్తాయి!

Diwali 2024 Quotes in Telugu :

"దీపకాంతిలా మీ చుట్టూ సంతోషం నిండాలి..

చీకటిలా మీ కష్టాలన్నీ కరిగిపోవాలి..

మీ జీవితం ఆనందమయం కావాలని కోరుకుంటూ..

- అందరికీ దీపావళి శుభాకాంక్షలు 2024!!"

"లక్ష్మీదేవి మీ ఇంట కొలువై ఉండగా..

సంతోషం పాలై పొంగగా..

దీపకాంతులు వెలుగునివ్వగా..

ఆనందంగా ఈ దివాళీ జరుపుకోవాలని వేడుకుంటూ..

- మీకు, మీ కుటుంబ సభ్యులకు హ్యాపీ దీపావళి!!"

"ఓ చిట్టి దీపంఆవిరవుతూ అందరికీ వెలుగునిస్తుంది..

ఆ ప్రేరణతోనే అందరం ముందుకు సాగుదాం..

- బంధుమిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు!"

"కారుచీకట్లను దీపాల కాంతులు తరిమేసినట్టే..

ఈ దీపావళి పండుగ మీ కష్టాలను తరిమేయాలని ఆకాంక్షిస్తూ..

- దీపావళి శుభాకాంక్షలు!!"

దీపావళి ఒక్కరోజు కాదు ఐదు రోజుల పండగని మీకు తెలుసా? - ఆ విశేషాలు మీకోసం!

ABOUT THE AUTHOR

...view details