Half Percent Appeared for Group-3 Exam in Telangana :ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగం అంటే అర్హత, వయసు ఉన్న ప్రతిఒక్కరు దరఖాస్తు చేసుకుని పరీక్షకు హాజరయ్యేవారు. ప్రభుత్వం ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో దశాబ్దం పైగా పుస్తకాలతో కుస్తీ పడుతున్న వారు సైతం కనిపిస్తుంటారు. ఎప్పుడు చూసిన చదువుతునే ఉంటారు. రాష్ట్రంలోని అనేక గ్రంథాలయాల్లో నేటికి వేలాది మంది అభ్యర్థులు ప్రభుత్వ కొలువులు సాధించడమే లక్ష్యంగా శ్రమిస్తుంటారు. పోస్టు చిన్నాదా పెద్దదా అని ఆలోచించకుండా సర్కార్ కొలువు అయితే చాలు జీవితంలో స్థిరపడిపోవచ్చని తీవ్రంగా శ్రమిస్తుంటారు. కోచింగ్ అని, టేస్టులని రేయిపగలు పుస్తకాలను ముందు వేసుకుని చదివేస్తుంటారు ఈ నెల 17, 18 తేదీల్లో జరిగిన గ్రూప్-3 పరీక్షల హాజరు శాతం మాత్రం అందుకు భిన్నంగా ఉంది. అందుకు కారణాలు ఏంటో చూద్దాం.
- పరీక్ష దరఖాస్తుకు, పరీక్షకు రెండేళ్ల జాప్యం ఉండడం
- గురుకులాల్లో పలువురు ఉద్యోగాలు సాధించడం
- అభ్యర్థుల్లో అనేక మంది పోలీస్ కానిస్టేబుల్ శిక్షణలో ఉండడం
- ఇటీవల విడుదలైన డీఎస్సీ ఫలితాల్లో ఉద్యోగాలు సాధించడం
- జేఎల్ ఉద్యోగాలు పొందడం
- కొంతమంది అభ్యర్థులకు పరీక్ష కేంద్రాలు దూరంగా ఉండడం.
గ్రూపు-2, 3 పోస్టులు ఒకే దఫా భర్తీ.. టీఎస్‌పీఎస్సీకి సర్కారు సంకేతాలు
సగం మంది మాత్రమే హాజరు :రాష్ట్రంలో 1,365 గ్రూప్-3 సర్వీసుల పోస్టుల భర్తీకి ఆది, సోమవారాలు పరీక్షలకు సగం మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. అయితే ఈ పరీక్షలకు మొత్తం 5,36,400 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆదివారం జరిగిన పేపర్-1 ఎగ్జామ్‌కు 2,73,847 మంది, పేపర్-2 ఎగ్జామ్‌కు 2,72,173 మంది పరీక్ష రాశారు. మొత్తం పరీక్షలకు 50.7 శాతం మంది హాజరయ్యారని టీజీపీఎస్సీ వెల్లడించింది. కాగా పేపర్-1 ప్రశ్నపత్రంలో అన్ని సమాధానాలు గుర్తించేందుకు టైమ్ సరిపోలేదని కొందరు అభ్యర్థులు అన్నారు. పేపర్-2 ప్రశ్నపత్రం మధ్యస్థంగా ఉందని తెలిపారు.