Guntur BR Stadium Works No Quality: గుంటూరులో పేరెన్నికగన్న కాసు బ్రహ్మానందరెడ్డి స్టేడియం అభివృద్ధిని వైఎస్సార్సీపీ ప్రభుత్వం అటకెక్కించింది. ఒకప్పుడు పీటీ ఉష లాంటి క్రీడాకారులకు పరుగులు నేర్పిన ఈ మైదానాన్ని గత ఐదేళ్లలో రన్నింగ్ శిక్షణ ఇచ్చే దిక్కులేకుండా చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ స్టేడియాన్ని అంతలా ఆగం చేసింది! అధికారంలో ఉన్న ఐదేళ్లూ అభివృద్ధి ఊసెత్తని వైఎస్సార్సీపీ నాయకులు, 2024 ఎన్నికలకు ముందు ఏకపక్షంగా అనాలోచిత నిర్ణయాలు తీసుకున్నారు. క్రికెట్ స్టేడియం సాకుతో మైదానంలో గతంలో ఉన్న బాస్కెట్బాల్, వాలీబాల్ కోర్టులు, అథ్లెటిక్ ట్రాక్‌ను తొలగించారు. అన్నిఆటలకు ఉపయోగపడే మైదానాన్ని కేవలం అధికారులు మాత్రమే ఆడుకోవాలనే దుర్భుద్ధితో ఇలా చేశారనే విమర్శలున్నాయి.
పోనీ చేపట్టిన పనుల్లోనైనా చిత్తశుద్ధి ఉందా అంటే అదీలేదు. చేపట్టిన స్టేడియం అభివృద్ధి పనులు నాసిరకంగా ఉండటం పట్ల క్రీడాకారులు, క్రీడాభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పనుల నిర్వహణలో ఎర్రమట్టి కాకుండా సుద్దమట్టి వాడారు. అధిక శాతం సుద్దమట్టి, దానిపై ఒక లేయర్ తూతూమంత్రంగా ఎర్రమట్టి వేశారు. ఐతే నిధుల సమస్యతో గుత్తేదారు ఆపనీ మధ్యలోనే నిలిపివేశారు. క్రికెట్ స్టేడియం చుట్టూ నాసిరకంగా డ్రైనేజీ కాల్వల నిర్మాణం చేపట్టారు. ట్రాక్‌చుట్టూ సైడు డ్రైన్లు వీధి కాల్వల మాదిరి చిన్నవిగా నిర్మించారు. పైగావాటిని ప్రధాన డ్రెైన్‌కు అనుసంధానం చేయలేదు. ఫలితంగా చిన్నపాటి వర్షాలకే డ్రెయిన్లలో నీళ్లు నిల్వ ఉంటున్నాయి.
ప్రభుత్వ స్థలంలో వైసీపీ నేత కట్టడం - కూల్చివేసిన అధికారులు - YSRCP leader occupying govt land
అస్తవ్యస్తంగా మైదానంలో డ్రైనేజ్‌ల నిర్మాణం: డ్రైయిన్ల నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఇటీవల కురిసిన వర్షానికి డ్రెయిన్లలో పడిన నీళ్లు అలానే నిల్వ ఉండటంతో దుర్వాసన వస్తోంది. ఆ కాల్వల నిర్మాణంలో తగు పాళ్లల్లో సిమెంట్, ఇసుక వంటివి వినియోగించకపోవటంతో అప్పుడే నాణ్యతలేమి బయటపడుతోంది. పనులు ఎక్కడికక్కడ అసంపూర్తిగా ఉన్నాయి. స్టేడియంలోని గ్రౌండ్ గట్టిగా ఉండాలన్నా, వర్షం వచ్చినప్పుడు సైతం ఆటకు అంతరాయం కలగకుండా ఉండటానికి ఎర్రమట్టి రెండు, మూడు లేయర్లు వినియోగించి దానిపై ఇసుక వంటివి చల్లి గ్రౌండ్‌ను చదును చేయాలి. ఏ వైపు నుంచి చూసినా ఎత్తుపల్లాలు, ఎగుడుదిగుడు లేకుండా సాఫీగా కనిపించాలి. కానీ ట్రాకులో అత్యధికంగా నిబంధనలకు విరుద్ధంగా సుద్దమట్టి తీసుకొచ్చి పోశారు.