Guinness world Records Family: సాధారణంగా ఒక్కరు గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు సాధించారంటేనే ఎంతో అరుదైన విషయంగా చెప్పుకొంటాం. ఎందుకంటే ఎంచుకున్న విషయంపై కఠోర సాధనతో పాటు కుటుంబ సహకారం ఉంటేనే ఆ రికార్డుని సాధించగలం. అలాంటిది ఒకే కుటుంబానికి చెందిన నలుగురూ ‘గిన్నిస్ వరల్ట్ రికార్ట్స్’లో స్థానం సంపాదించారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాకి చెందిన ఈ కుటుంబం గురించి ప్రస్తుతం తెలుసుకుందాం.
నలుగురికీ స్ఫూర్తినిచ్చే దీక్ష, పట్టుదల ఉన్న ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఆ కుటుంబం ప్రస్తుతం చైనాలో స్థిరపడ్డారు. జిల్లా కేంద్రమైన అనకాపల్లికి చెందిన కొణతాల విజయ్‌కి డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టం. విజన్ కొంతకాలం కొరియోగ్రాఫర్‌గా పని చేశారు. అదే విధంగా యోగాలోనూ ప్రావీణ్యం సంపాదించారు. విజయ్ భార్య జ్యోతి సైతం యోగాలో సాధన చేశారు.
2014లో చైనాకు వెళ్లిన ఈ ఆంధ్రా కుటుంబం, చైనాలో యోగా, డ్యాన్స్ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. అనంతరం యోగాలో ప్రయోగాలు చేయడం మొదలుపెట్టారు. తొలుత విజయ్ గిన్నిస్ రికార్డు సాధించారు. 2012లో విజయ్ అష్టవక్రాసనం 22 నిమిషాలు, బాకాసనం 3 నిమిషాలు, మయూరాసనం 2 నిమిషాలపాటు వేసి గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకున్నారు.