ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేటి నుంచి గ్రూప్​-2 పరీక్షలు - ఫొటో గుర్తింపు కార్డు తీసుకురావాలి​ - అభ్యర్థులకు TGPSC సూచన - GROUP 2 EXAMS IN TELANGANA

తెలంగాణలో నేటి నుంచి ప్రారంభం కానున్న గ్రూప్​-2 పరీక్షలు - ఏర్పాట్లను పరిశీలించిన టీజీపీఎస్సీ ఛైర్మన్​ - అభ్యర్థులందరికీ బయోమెట్రిక్​ తప్పనిసరని వెల్లడి

group_2_exams_in_telangana
group_2_exams_in_telangana (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 14, 2024, 7:03 PM IST

Updated : Dec 15, 2024, 6:14 AM IST

Group 2 Exams Starts in Telangana: తెలంగాణలో 783 గ్రూప్‌-2 సర్వీసుల పోస్టుల భర్తీకి ఈ నెల 15, 16వ తేదీల్లో పరీక్షలు నిర్వహించేందుకు టీజీపీఎస్సీ పటిష్ఠ ఏర్పాట్లు చేసింది. ఓఎంఆర్‌ పద్ధతిలో పరీక్షల నిర్వహణకు తెలంగాణ వ్యాప్తంగా 1,368 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేసింది. ఈ పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ 2022 డిసెంబరు 29న ప్రకటన జారీ చేయగా 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షల నిర్వహణకు గతంలో ఏర్పాట్లు చేసినా వివిధ సాంకేతిక కారణాల వల్ల అవి వాయిదా పడ్డాయి. ఒక్కోపేపర్‌కు 150 మార్కుల చొప్పున మొత్తం 4 పేపర్లకు 600 మార్కులకు పరీక్ష జరుగుతుంది.

పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఉంటాయి. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందు గేట్లు మూసివేస్తామని టీజీపీఎస్సీ ఇప్పటికే స్పష్టం చేసింది. హాల్‌టికెట్‌తోపాటు ప్రభుత్వం జారీ చేసిన ఫొటో గుర్తింపు కార్డు తీసుకురావాలని తెలిపింది. పరీక్ష రాసే అభ్యర్థుల్లో మహిళలు మంగళసూత్రం, గాజులు ధరించవచ్చని, చెప్పులు వేసుకుని రావాలని టీజీపీఎస్సీ సూచించింది. అభ్యర్థులందరూ బయోమెట్రిక్‌ తప్పనిసరి వేయాలని లేదంటే ఓఎంఆర్‌ పత్రాలు మూల్యాంకనం చేయబోమని టీజీపీఎస్సీ తెలిపింది.

పరీక్షల ఫలితాలు వేగంగా ఇస్తాం:రెండు రోజులు జరగనున్న గ్రూప్‌ 2 పరీక్షలకు ఏర్పాట్లు అన్నీ పూర్తి చేసినట్లు టీజీపీఎస్సీ ఛైర్మన్‌ బుర్రా వెంకటేశం తెలిపారు. 10 రోజులుగా అన్ని అంశాలపై సమీక్ష చేశామని చెప్పారు. పరీక్షలు సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరుగుతాయని పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌పై నమ్మకముంచి అభ్యర్థులు పరీక్షలు రాయాలని కోరారు. పరీక్షలపై అభ్యర్థులకు ఎలాంటి అపోహలు, అనుమానాలు పెట్టుకోవద్దని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 5.51 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని వెల్లడించారు. ప్రశ్నా పత్రాలకు సంబంధించి 58 స్టోరేజ్ పాయింట్లు పెట్టామని అభ్యర్థికి తప్ప ప్రశ్నాపత్రం ఎవరికీ తెలిసే అవకాశం లేదని వివరించారు. 2015లో గ్రూప్ 2 నోటిఫికేషన్ అమలుకు చాలా సమయం తీసుకున్నారు కానీ ఈ సారి ఫలితాలు వేగంగా ఇస్తామని బుర్రా వెంకటేశం తెలిపారు.

'భలే మంచి బేరం' - హైదరాబాద్​లో సొంతింటి కల నెరవేర్చుకోండిలా!

పనితీరు ఆధారంగానే పదవులు - ఏమీ చేయకుండా ఉంటే కుదరదు: చంద్రబాబు

Last Updated : Dec 15, 2024, 6:14 AM IST

ABOUT THE AUTHOR

...view details