Industrialist VC Janardhan Rao Murder Case:హైదరాబాద్ పంజాగుట్టలో పారిశ్రామికవేత్త, వెల్జాన్ గ్రూప్ అధినేత వెలమాటి చంద్రశేఖర జనార్దనరావును సొంత మనువడు అతి కిరాతంగా హత్య చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. ఆస్తి తగాదాల కారణంగా ఈ దారుణానికి ఒడికట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడిని కస్టడీలోకి తీసుకుని లోతైన దర్యాప్తు చేస్తే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందని పంజాగుట్ట పోలీసులు చెబుతున్నారు.
నిందితుడికి రిమాండ్ : ప్రముఖ పారిశ్రామికవేత్త, వెల్జాన్ గ్రూపు సంస్థల అధినేత వెలమాటి చంద్రశేఖర జనార్దనరావు హత్య కేసులో నిందితుడు కీర్తి తేజను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గురువారం (ఫిబ్రవరి 06) రాత్రి బేగంపేట భీమా జువెలర్స్ వద్ద ఓ వ్యక్తి కత్తిపొట్లకు గురైనట్లు ఫోన్‌కాల్ రావడంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అప్పటికే జనార్దనరావు రక్తపు మడుగులో పడి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. జనార్దనరావుతో పాటు గాయాలైన కుమారై సరోజినిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పోలీసులు చెప్పారు.
తాతపై 73 కత్తిపోట్లు, తల్లిపై 12 సార్లు దాడి : ఆస్తి తగాదాల కారణంగా తన మనవడి చేతిలో జనార్దనరావు దారుణ హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తే అసలు విషయం తెలిసే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. డైరెక్టర్ పోస్ట్ ఇవ్వకపోవడంతో 73 సార్లు కసితో కీర్తి తేజ చంపాడు. జనార్దన్ రావును చంపుతుంటే అడ్డం వచ్చిన తల్లిపై 12 సార్లు కీర్తి తేజ కత్తితో దాడి చేశాడు. తల్లి, తాత అరుపులు విని ఇంట్లోకి స్థానికులు వెంటనే వచ్చారు. అప్పటికే జనార్దన్ రావు చనిపోగా తీవ్ర గాయాలతో కీర్తి తేజ తల్లి కొట్టుమిట్టాడారు. కీర్తి తేజ తల్లిని ఆస్పత్రికి పోలీసులు తరలించారు. తన తాత జనార్ధన్ రావును చంపి తల్లిని తీవ్ర గాయాల పాలు చేసి కీర్తి తేజ ఏలూరు పారిపోయాడు.