ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మద్యం వ్యాపారులకు ప్రభుత్వం వార్నింగ్​ - ఎక్కువ ధరకు విక్రయిస్తే

మద్యం అక్రమాలపై భారీ జరిమానాలు విధిస్తూ ప్రభుత్వ నోటిఫికేషన్ - ఎంఆర్‌పీ కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తే రూ.5 లక్షలు జరిమానా

AP_Govt_on_Liquor_Rates
AP Govt on Liquor Rates (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 2, 2024, 5:17 PM IST

Updated : Dec 2, 2024, 6:05 PM IST

AP Govt on Liquor Rates: మద్యం అక్రమాలపై భారీ జరిమానాలు విధిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు మద్యం విక్రయిస్తే 5 లక్షలు జరిమానా విధిస్తామని తెలిపింది. మరోసారి అదే తప్పు చేస్తే దుకాణం లైసెన్స్‌ రద్దు చేస్తామని నోటిఫికేషన్‌లో వివరించింది. అదే విధంగా మద్యం దుకాణం పరిధిలో బెల్ట్ షాపులు నిర్వహించినా ఐదు లక్షల జరిమానా విధిస్తామని పేర్కొంది. ఏపీ ఎక్సైజ్‌ చట్టం 47-1 ప్రకారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. బార్‌ లైసెన్సులకు సైతం ఇదే నిబంధన వర్తిస్తుందని నోటిఫికేషన్‌లో తెలిపింది.

AP Govt on Liquor Rates (ETV Bharat)
Last Updated : Dec 2, 2024, 6:05 PM IST

ABOUT THE AUTHOR

...view details