Inner Ring Road in Amaravati :రాజధాని అమరావతి అభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్డు (IRR) ప్రతిపాదనను పరిశీలిస్తోంది. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్వాకంతో ఆగిపోయిన రాజధాని నిర్మాణ పనులు, ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పట్టాలెక్కించేందుకు కసరత్తు చేస్తున్న ప్రభుత్వం దానిలో భాగంగా ఐఆర్‌ఆర్ ప్రతిపాదననూ తెరపైకి తెచ్చింది.
IRR Amaravati :విజయవాడ తూర్పు బైపాస్‌కి ఎడంగా, కనీసం 20 కి.మీ. దూరం నుంచి ఐఆర్‌ఆర్ వెళ్లేలా ఎలైన్‌మెంట్ సిద్ధం చేయనుంది. దీనికి భూమిని భూసమీకరణ విధానంలో తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. గతంలో టీడీపీ హయాంలో సుమారు 180 కి.మీ. పొడవైన అమరావతి అవుటర్ రింగ్‌రోడ్డు (ORR)తో పాటు, సుమారు 97.5 కి.మీ. పొడవైన అమరావతి ఐఆర్‌ఆర్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అమరావతి, విజయవాడ నగరాల చుట్టూ నిర్మిస్తూ తాడేపల్లి, మంగళగిరిలతో పాటు, ఉమ్మడి, కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోని పలు గ్రామాలు ఐఆర్‌ఆర్ లోపలికి వచ్చేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.
Amaravati Inner Ring Road :2019లో అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అమరావతి నిర్మాణ పనులు నిలిపివేయడంతో పాటు, ఓఆర్‌ఆర్, ఐఆర్‌ఆర్ ప్రతిపాదనల్ని పూర్తిగా అటకెక్కించింది. ఇప్పుడు విజయవాడ పశ్చిమ బైపాస్ నిర్మాణం శరవేగంగా జరుగుతుండటం, తూర్పు బైపాస్ కూడా నిర్మిస్తే అది ఒక రింగ్‌రోడ్డులా ఏర్పడుతుంది కాబట్టి ప్రస్తుతానికి అమరావతికి ఐఆర్‌ఆర్ ప్రతిపాదన పక్కన పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం మొదట అనుకుంది. కానీ రాబోయే రోజుల్లో అమరావతి, విజయవాడ, గుంటూరు నగరాలు, మంగళగిరి, తాడేపల్లి పట్టణాలు కలిసిపోయి మహా నగరంగా అభివృద్ధి చెందే అవకాశం ఉండడం, అమరావతి, విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతుండడంతో ఐఆర్‌ఆర్ కూడా అవసరమేనని సూత్రప్రాయంగా నిర్ణయించింది.
గతంలో 3 ప్రతిపాదనలు:అమరావతి, విజయవాడ చుట్టూ 8 వరుసల ప్రధాన రహదారి, నాలుగు వరుసల సర్వీస్ రోడ్డుతో ఐఆర్‌ఆర్ నిర్మాణానికి గతంలో మూడు ఎలైన్‌మెంట్లు సిద్ధం చేశారు. 2.5 మీటర్ల వెడల్పుతో సైకిల్ ట్రాక్, మరో 2.5 మీటర్ల వెడల్పుతో ఫుట్‌పాత్ కూడా ప్రతిపాదించారు. అప్పట్లో రూపొందించిన మూడు ప్రతిపాదనలు
ప్రతిపాదన 1 :
పొడవు : 94.5 కి.మీ.
అవసరమైన భూమి: 1,165 ఎకరాలు
నిర్మాణ వ్యయం: రూ.5,918 కోట్లు
ప్రతిపాదన 2 :