Indiramma Housing Scheme App in Telangana: తెలంగాణలో పేదవారికి ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ మేరకు ఇందిరమ్మ ఇళ్ల పథకం యాప్‌ను సిద్ధం చేశారు. నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ యాప్ ద్వారా దరఖాస్తుదారుల వివరాలు సేకరించారు. అయితే ఇందులో ఎలాంటి సమస్యలు రాకపోవడంతో అధికారికంగా ఈ యాప్‌ను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
వేగంగా ఎంపిక ప్రక్రియ: ఇప్పటికే ప్రజాపాలన కార్యక్రమంలో ప్రభుత్వం అప్లికేషన్లను స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సచివాలయంలో గురువారం(13-04-2024) సీఎం రేవంత్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు ఈ యాప్‌ను ఆవిష్కరించనున్నారు. ఏడాది ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా ఈ ఇళ్ల పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం అనుకుంటోంది. గత నెలలోనే ఈ పథకాన్ని ప్రారంభిస్తామని ప్రభుత్వం చెప్పినా ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే కారణంగా పెండింగ్లో పెట్టారు. ఇప్పుడు సీఎం చేతుల మీదుగా యాప్ ప్రారంభించగానే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగవంతం కానుంది.
తిరుపతి జిల్లాను వీడని ఫెయింజల్ - 912 హెక్టార్లలో దెబ్బతిన్న వరి పంట