Government Planned To R&B Roads Under PPP Model :ప్రస్తుతం జాతీయ రహదారులపై వాహనాల ప్రయాణం సాఫీగా సాగిపోతుంది. హైవేలపై ఎక్కడా గుంతలు కనిపించవు. ఐదేళ్లకోసారి తప్పనిసరిగా కొత్త బీటీ లేయర్ వేస్తారు. ఎందుకంటే మొత్తం నిర్వహణంతా గుత్తేదారే చూసుకుంటారు కాబట్టి. ఇకపై రాష్ట్రంలోని పలు ఆర్‌అండ్‌బీ రోడ్లలో కూడా ఇటువంటి విధానమే అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య విధానం (PPP) ద్వారా గుత్తేదార్లకు రోడ్ల నిర్వహణ అప్పగించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది.
రోడ్ల బాధ్యతంతా గుత్తేదారులదే : ఏటా ఆయా రోడ్లలో వర్షాలకు గుంతలు పడితే వాటిని పూడ్చేందుకు ప్రభుత్వం నుంచి నిధుల కేటాయింపు కోసం ఎదురుచూడటం, ఐదేళ్లకోసారి రెన్యువల్స్ వేసేందుకు అనుమతులు తీసుకోవడం వంటివి ఇకపై ఉండవు. చివరకు రోడ్లకు ఇరువైపులా పెరిగిన పిచ్చిమొక్కల తొలగింపు కోసం కూడా ప్రభుత్వం నుంచి అనుమతులు, నిధుల కేటాయింపునకు వేచి ఉండాల్సిన పరిస్థితి. ఇకపై ఇటువంటిదేమీ లేకుండా పీపీపీ విధానంలో ఆయా రోడ్ల నిర్వహణ బాధ్యత మొత్తాన్ని గుత్తేదారే చూసుకుంటారు. వాహన రద్దీ ఎక్కువగా ఉండే రాష్ట్ర రహదారు (State Highway)ల్లో తొలి విడత 18 రోడ్లను, అనంతరం రెండో విడతలో 68 రోడ్లను ఎంపిక చేశారు.
రహదారుల కోసం సీఎం చంద్రబాబు వినూత్న ఆలోచన - గోదావరి జిల్లాల నుంచే అమలు