ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వరద బాధితులకు సహాయం చేయాలనుకుంటున్నారా? - బ్యాంక్​ ఖాతాల నంబర్లు ఇవే - Donate For Flood Victims

Government Gave Accounts For Donations: వరద బాధితులకు సహాయం చేయాలనుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చింది. దాతలకు సమాచారం అందించేందుకు హెల్ప్​ లైన్​ నెంబరు ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్‌ చెల్లింపుల ద్వారా కూడా సహాయం చేయవచ్చని అధికారులు తెలిపారు.

Government Gave Accounts For Donations
Government Gave Accounts For Donations (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 3, 2024, 8:47 PM IST

Updated : Sep 3, 2024, 9:54 PM IST

Government Gave Accounts For Flood Victims Donations : వరద బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. బాధితులకు ఏ రూపంలోనైనా సాయం అందించాలని సీఎం చంద్రబాబు కోరారు. స్వచ్ఛందంగా ఆహారం ఇవ్వదలచిన దాతల కోసం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ప్రత్యేక పాయింట్‌ ఏర్పాటు చేశారు.

ఆహారం అందించే దాతలను కో-ఆర్డినేట్ చేసుకునే బాధ్యతను ఐఏఎస్ మనజీర్‌కు అప్పగించారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చే దాతలకు మరింత సమాచారం అందించేందుకు 79067 96105 నెంబరు ఏర్పాటు చేశారు. ధన సహాయం చేసే దాతలు ఆన్‌లైన్‌ చెల్లింపు ద్వారా ఈ క్రింద పేర్కొన్న బ్యాంక్ ఖాతాలకు జమ చేయవచ్చని అధికారులు తెలిపారు.

బ్యాంక్ ఖాతాల వివరాలు:

State Bank Of India:

A/c Name : CMRF
A/c Number : 38588079208
Branch: AP Secretariat
IFSC code : SBIN0018884

Union Bank of India:
A/c name : CM Relief Fund
A/c number : 110310100029039
Branch: AP Secretariat, Velagapudi.
IFSC code : UBIN0830798.

"మేమున్నాం" అంటూ విరాళాల వెల్లువ - వారందరికీ లోకేశ్ కృతజ్ఞతలు - Donations to help flood victims

లోకేశ్​కు చెక్కు అందజేసిన దాతలు : వరద బాధితుల కోసం సహాయం చేసేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ రమేష్ రూ.5 లక్షలు, మంగళగిరికి చెందిన లక్ష్మీ, వెంకటనారాయణ దంపతులు రూ.1.2 లక్షల చెక్కును మంత్రి నారా లోకేశ్​కు అందజేశారు.

సీఎంఆర్‌ఎఫ్‌కుమంత్రి టీజీ భ‌ర‌త్ విరాళం:వరద బాధితుల కోసం సీఎం రిలీఫ్​ ఫండ్​కు రూ.10 లక్షల విరాళాన్ని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్ ప్రకటించారు. వరద బాధితులను ఆదుకునేందుకు అంద‌రూ సాయం చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. సంక్షోభ సమయంలో అందరూ అండగా నిలవాలని మంత్రి భ‌ర‌త్ కోరారు.

పెద్ద మనసు చాటుకున్న సినీ హీరోలు - వరద సాయం ఎవరెంత ఇచ్చారంటే! - Tollywood donates to flood victims

Last Updated : Sep 3, 2024, 9:54 PM IST

ABOUT THE AUTHOR

...view details