AP Integrated Clean Energy Policy 2024 :ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ విధానం 2024 (AP ICE Policy 2024)ను రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. ఐదేళ్ల పాటు క్లీన్ ఎనర్జీ పాలసీ అమల్లో ఉంటుందని స్పష్టం చేస్తూ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ మేరకు సమీకృత క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 విధివిధానాలు ఏపీ ఇంధన శాఖ జారీ చేసింది.
9.5 గిగావాట్ల ఉత్పత్తి : సౌర, పవన, హైబ్రీడ్, మినీ హైడ్రో ప్రాజెక్టులు, పంప్డ్ స్టోరేజీ ప్లాంట్లు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ, గ్రీన్ హైడ్రోజెన్ ప్రాజెక్టులు, బయో ఇంధనాలు, ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు లాంటి ప్రాజెక్టులకు విస్తృతమైన అవకాశాలు ఉన్నట్లు వెల్లడించారు. 2024 ఆగస్టు 31 తేదీ నాటికి ఏపీలో సంప్రదాయేతర ఇంధన వనరుల ఉత్పత్తి 9.5 గిగావాట్లుగా ఉందని స్పష్టం చేశారు.
ఎనర్జీ స్టోరేజ్ క్యాపిటల్‌గా ఏపీని మార్చుతాం: మంత్రి గొట్టిపాటి - Gottipati At RE INVEST 2024
గ్రీన్ హైడ్రోజన్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు : రాష్ట్రంలో పవన విద్యుత్ 74.9 గిగావాట్ల మేర, పంప్డ్ స్టోరేజి విద్యుత్ ఉత్పత్తి 43.89 గిగావాట్ల మేర ఉత్పత్తి చేసే అవకాశం ఉందని వెల్లడించారు. మొత్తం 39 ప్రదేశాల్లో వీటి ఉత్పత్తికి అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు. నిరంతరాయ విద్యుత్ ఉత్పత్తి సరఫరా (Uninterruptible Power Generation Supply) కోసం గ్రీన్ హైడ్రోజన్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు కూడా ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందని వెల్లడించారు.
విద్యుత్‌ను దాచుకుందాం- అవసరమైనప్పుడు వాడుకుందాం! ఏపీలో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం - Battery Storage Projects In AP
3 వేల మెగావాట్ల ఎలక్ట్రోలైజర్స్ ఉత్పత్తి :బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ ద్వారా 25 గిగావాట్ల మేర, ఏడాదికి 1.50 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి అస్కారం ఉందని ఎనర్జీ పాలసీలో ప్రభుత్వం పేర్కొంది. రోజుకు 10 వేల టన్నుల సీఎన్జీ, సీబీజీ లాంటి బయో ఫ్యూయెల్స్ ఉత్పత్తికి అవకాశం ఉందని స్పష్టం చేశారు. 5 వేల మెగావాట్ల బ్యాటరీ ఉత్పత్తి, 3 వేల మెగావాట్ల ఎలక్ట్రోలైజర్స్ ఉత్పత్తికి ఆస్కారం ఉందని వెల్లడించారు.
దేశంలో తొలి 'సోలార్ విలేజ్'గా మొఢేరా